అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం.. నడిరోడ్డుపై పంది గొంతుకోసి, పసుపు, కుంకుమ చల్లి ..

Published : Jan 03, 2022, 04:38 PM IST
అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం.. నడిరోడ్డుపై పంది గొంతుకోసి, పసుపు, కుంకుమ చల్లి ..

సారాంశం

ఓ వరాహాన్ని భయంకరంగా బలి ఇచ్చి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చీర, చాటలతో పూజలు చేశారు. ప్రధాన రహదారిపై నిరంతరం వాహనాల రద్దీ ఉన్నప్పటికీ pigని చంపి క్షుద్రపూజలు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  గత రాత్రి అమావాస్య ఆదివారం కావడంతో.. పూజలు వేరే ఎక్కడైనా జరిపి ఇక్కడకు తెచ్చి పడవేశారా అన్న భావన స్థానికుల్లో నెలకొంది.

అచ్చంపేట : covid19 కల్లోలంలోనూ క్షుద్రపూజలు ఆగడం లేదు. మహమ్మారికి vaccine కనిపెట్టాం.. కానీ ఈ Superstitionకు ముగింపు పలకలేక పోతున్నాం. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేటలో witchcraft కలకలం రేపాయి. అచ్చంపేట-మాదిపాడు ప్రధాన రహదారి తాళ్ళచెరువు అడ్డరోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులకు భయాందోళనలకు గురి చేశాయి.

ఓ వరాహాన్ని భయంకరంగా బలి ఇచ్చి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చీర, చాటలతో పూజలు చేశారు. ప్రధాన రహదారిపై నిరంతరం వాహనాల రద్దీ ఉన్నప్పటికీ pigని చంపి క్షుద్రపూజలు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  గత రాత్రి అమావాస్య ఆదివారం కావడంతో.. పూజలు వేరే ఎక్కడైనా జరిపి ఇక్కడకు తెచ్చి పడవేశారా అన్న భావన స్థానికుల్లో నెలకొంది.

అమావాస్య ఆదివారం రావడంతో క్షుద్రపూజలు  చేసే మంత్రగాళ్లు రెచ్చిపోయారు. ఆదివారం రోజు వచ్చే అమావాస్యలో పూజలు చేస్తే క్షుద్ర దేవతలు కరుణిస్తాన్న మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే  పూజలు చేసినట్లుగా భావిస్తున్నారు 

నందిగామలో దారుణం... మైనర్ బాలికపై అర్ధరాత్రి యువకుడి అత్యాచారయత్నం

ఇదిలా ఉండగా, జిల్లాలోని పాల్వంచ పట్టణంలో డిసెంబర్ నెల మొదట్లో Witchcraft కలకలం రేపాయి. ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ.. కొత్త భార్య కోసం అంతకు ముందు భార్యలను హతమారుస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే third wife కోసం, second wifeను చంపాలని దారుణమైన పథకం వేశాడు. రెండో భార్య గోపికను murder చేసేందుకు భర్త క్షుద్ర పూజలు చేయించడం స్థానికంగా సంచలనంగా మారింది.

కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయించడం, దీనికోసం సుపారీ ఇవ్వడంలాంటివాటితో  స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శేఖరబంజరకు చెందిన కుమార్ auto driver గా పని చేస్తున్నాడు. ఈయన  కొన్నేళ్ళ క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.  ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమెను వదిలేశాడు. ఆ తరువాత gopika అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె దగ్గర ఉన్న బంగారం డబ్బు మొత్తం కాజేశాడు.

విశాఖ జిల్లాలో దుర్ఘటన... టీవి పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు

ఇక ఆమెతో పనిలేదనుకున్నాడేమో.. మరో మహిళను మూడో పెళ్ళి చేసుకున్నాడు.  మొదటి భార్యను వదిలేయడంతో అడ్డుతొలిగింది. కానీ రెండో భార్యను వదిలేయలేదు.. దీంతో మూడో భార్యతో తన బంధానికి  రెండో భార్య గోపిక అడ్డుగా ఉందనుకున్నాడు. అందుకే ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. 

తన చేతికి మట్టి అంటకుండా చంపాలనుకున్నాడు. దీనికోసం ఆమెను హతమార్చేందుకు తాంత్రిక  మాంత్రికుడితో సుఫారీ మాట్లాడుకుని క్షుద్ర పూజలు చేయించాడు. దీన్ని గమనించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించుకుంది. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఈ పూజల తతంగం అంతా స్థానికులు గమనిస్తున్నారు. కుమార్ పద్ధతిపై, తరచుగా పెళ్లిళ్లు చేసుకుంటూ భార్యల్ని వదిలేయడంపై వారూ ఫిర్యాదు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే