సరదాగాః ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చిన ‘ముఖ్య’ నేత

First Published Feb 2, 2017, 8:56 AM IST
Highlights

ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు పలకడానికి అవసరమయితే బీకాం లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారి నేతృత్వంలో తన మంత్రి వర్గ సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని అమెరికా పంపుతానని ప్రపంచ దేశాల అధ్యక్షులకు ముఖ్యనేత హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

 

రాను రాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేష్టలు మితి మీరిపోతున్నాయి. ఆయన తీసుకునే నిర్ణయాలను సహించలేక ఆందోళనతో ప్రపంచ దేశాల అధ్యక్షులు రాష్ట్రంలోని ఓ ‘ముఖ్య’ నేత దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. అయితే సదరు ముఖ్య నేత కూడా అప్పటికే ట్రంప్ వ్యవహారాలను వినటంతో ఆయన కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తాను  నేర్పిన పాఠాలు చదివి తనకు తెలియకుండా విధాన పరమయిన నిర్ణయాలను తీసుకుంటున్నాని ముఖ్య నేత అసహనంతో ఉన్నారు.

 

రోజుకు 36 గంటలు కష్టపడుతున్న తన గురించి తెలిసి కూడా తన ప్రమేయం లేకుండా ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడం పట్ల నేరుగా వైట్ హౌజ్ అధికారులకే ఫోన్ చేసి తీరు మార్చుకోవాలని ముఖ్యనేత చెప్పినట్లు సమాచారం. ఎప్పుడైతే ముఖ్యనేత జోక్యం చేసుకున్నారో  తమ కష్టాలు నెరవేరుస్తాడని ప్రపంచ నేతలు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో తమ కష్టాలు తొలగిపోతాయనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.

 

ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు పలకడానికి అవసరమయితే బీకాం లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారి నేతృత్వంలో తన మంత్రి వర్గ సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని అమెరికా పంపుతానని ప్రపంచ దేశాల అధ్యక్షులకు ముఖ్యనేత హామీ ఇచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియ లో సర్క్యులేషన్లో ఉన్న పోస్టు ఇది

click me!