
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాత ఇంటి వైపే అడుగులేస్తున్నారు.
జరిగిందేదో జరిగిపోయింది, మిగతా పార్టీలకంటే కాంగ్రెసే సుఖం అని ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత కనుమరుగయిన కిరణ్ ఇపుడు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనను సిన్సియర్ గా అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయి, ఎన్నికల తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఆ పైన బిజెపిలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అక్కడ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడొకరు తలుపు మూసేయడంతో ఎటూపోలేక, ఎమీ పాలుపోక, ఏదో పుస్తకం రాయబోతున్నారని ఆమధ్య వార్తలొచ్చాయి.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలన్నింటిని వెల్లడిస్తూ ఆయన పుస్తకం రాస్తే కచ్చితంగా అది పాపులర్ అవుతుందనడంతో అనుమానం లేదు.
పుస్తకం ఎంతవరకు వచ్చిందో తెలియదు కాని, ఆయన ఇపుడు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది.
కాంగ్రెస్ లోకి తిరిగచ్చేందుకు ఆయన సుముఖంగా వున్నారని, కిరణ్ను సాదరంగా ఆహ్వానించుందుకు పార్టీకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పార్టీకి, కిరణ్ కి మధ్య విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు దౌత్యం నెరుపుతున్నారని కూడా విశ్వసనీయ సమాచారం.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, కిరణ్ లాగే పార్టీ కార్యకలాపాలకు దూరమయిన ఆంధ్ర ప్రదేశ్ చివరి స్పీకర్ నాదెండ్ల మనోహన్ ఇపుడు మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన ఈ మధ్య రెండు విలేకరుల సమావేశాలలో కూడా పాల్గొన్నారు.
పాతవాళ్లందరిని కూడా మళ్లీ వెనక్కు పిలిపించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు సమాచారం.
అయితే, మరొక ముఖ్యవిషయం. కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కోరుతున్నట్లు వినికిడి. గత రెండేళ్ల పిసిసి అధ్యక్షుడిగా రఘువీరా రెడ్డి బాగా ప్రశంసలందుకున్నారు. ఆయన పనితీరుతో పార్టీ నాయకత్వం సంతృప్తిగానే ఉంది. అందువల్ల ఈ కోరిక తీర్చడం సాధ్యమా...