నోెరు పారేసుకున్నందుకు నోటీసు

First Published Jan 12, 2017, 4:45 AM IST
Highlights

రోత రాజరాజకీయాలకు నోబెల్ ఫ్రయిజ్ ఉంటే ఏటా తెలుగు రాజకీయ నాయకులే కొట్టే సే వారు.

రోత రాజరాజకీయాలకు నోబెల్ ఫ్రయిజ్ ఉంటే ఏటా తెలుగు రాజకీయ నాయకులే కొట్టే సే వారు.

 

ఎందుకంటే, తిట్టుకోవవడంలో సిగ్గొలొదిసినోళ్లు చాలా ఎక్కువ ఈ ప్రాంతంలో.  ఒకరు ఒక రోత అయితే, అవతలి నాయకుడు డబల్ రోత.

 

తాజాగా వైసిపి ఎమ్మెల్యే రోజాను, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కిశోర్ బాబు ఎలా తిట్టాడో చూడండి.“ రోజా అసలు స్త్రీయేనా? అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ‘‘చంద్రబాబుపై నోరుజారితే ఖబడ్దార్‌. నాలుకలకు కత్తెరవేస్తాం. సర్జరీ చేస్తాం. రోజా ఏం మాట్లాడుతుందండి. అసలు రోజా ఒక స్త్రీయేనా? స్త్రీజాతి సిగ్గుతో తలొంచుకోవాలి. ఆమె మాటేంటి? ఆమె వేషమేంటి? ఆమె భాషేంటి? ఆమె ప్రవర్తనేంటి? అసెంబ్లీలో బూతులు మాట్లాడేటటువంటి అరాచకవాది రోజా. అలాంటి రోజా కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు.’’ గుంటూరు జిల్లా ప్రతిపాడులోజరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రిగారు ప్రయోగించిన భాష.

 

ఇది ఎంత రోతగా ఉందో చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా రోజా గతంలో అసంబ్లీలో ప్రయోగించిన భాష కూడా తీవ్ర అభ్యంతరకరమయినది, రోతకల్గించేదే అనుమానం లేదు.

 

ఇలా నోరు పారేసుకోవడంలో కొంతమంది తెలుగు రాజకీయాలలో బాగా ముందుంటారు. జిల్లాకొకరో ఇద్దరు ఇలా చాలా సౌండ్ చేస్తుంటారు.  ఇలాంటి వారిలో నెల్లూరు జిల్లా గతంలో కాంగ్రెస్ నాయకుడు, ఇపుడు టిడిపి నాయకుడు అయిన ఆనం వివేకానందరెడ్డి ఒకరు.

 

ఆయన మామూలాగానే కలర్ ఫుల్ మనిషి. బోళా.  అలాంటపు డు ఆయన టిడిపిలోచేరాడు. చంద్రబాబు  కితాబు కోసం తన విద్యను రోజూ ప్రదర్శించేవారు. నెల్లూరు వున్నా. అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఈగ వాలకుండా చూసేవారు.  వైసిపి వాళ్లు ముఖ్యమంత్రిని ఒక్క మాటంటే, నెల్లూరు ఆయన స్ప్రింగ్ లాగా ఎగిరి పడేవారు రెండనేవారు.

 

ఇలా ఒక సారి ఆయన వైసిపి ఎమ్మెల్యే మీదనోరు పారేసుకున్నారు.  దీనితో రోజా రోడ్డెక్క కుండా కోర్టెక్కిక్కారు. ఆమె దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆనం వివేకానందరెడ్డికి నాంపల్లి మూడవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 8న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తన పరువుకు భంగం కలిగించేలా వివేకానందరెడ్డి వ్యాఖ్యలు చేశారని  రోజా ఆరోపణ.


2016, ఫిబ్రవరి 29న వివేకానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా మాట్లాడారని దీనికి సంబంధించిన వీడియో సీడీని న్యాయస్థానానికి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి  సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించి వివేకానందరెడ్డికి సమన్లు జారీ చేశారు.

click me!