
ఓ ఏనుగు అడవి నుంచి దారి తప్పి గ్రామ పరిసరాల్లోకి వచ్చింది. ఆ గ్రామంలో పరిధిలో వ్యవసాయ క్షేత్రాల మధ్య ఉన్న ఓ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో ఆ మూగ జీవి అల్లాడిపోయింది. అందులో నుంచి బయటకు ఎలా రావాలో అర్థం కాక అయోమయంలో పడింది. ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. ఎంతో నైపుణ్యంగా, చాకచక్యంతో ఆ ఏనుగు ప్రాణాలను కాపాడారు.
తెలివి ప్రదర్శిస్తున్నారా?... మోర్బీ విషాదం మీద గుజరాత్ హైకోర్టు సీరియస్...
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లాలోని గుండ్ల పల్లె పరిధిలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో ఓ ఏనుగు అనుకోకుండా సోమవారం రాత్రి పడిపోయింది. అప్పటి నుంచి అందులో నుంచి బయటకు రావడానికి ఆ ఏనుగు నానా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ మూగజీవికి ఆ బావిలో నుంచి స్వతహాగా బయటకు వచ్చే అవకాశం లేదు.
ఏనుగు బావిలో పడిపోయిందనే విషయాన్ని స్థానికులు అటవీ, అగ్నిమాపక శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో వారు అక్కడికి వెంటనే చేరుకొని దానిని కాపాడే ప్రయత్నాలు చేపట్టారు. అందులో భాగంగా ఓ జేసీబీని అక్కడికి తీసుకొచ్చారు. దాని ద్వారా ఆ బావి ప్రహారీని తవ్వడం ప్రారంభించారు. కొన్ని నిమిషాల ప్రయత్నాల తరువాత ఎట్టకేలకు ఆ ఏనుగు బయటకు రావడానికి దారి సిద్ధం అయ్యింది.
ఈసారి గుజరాత్ సీఎం ఆయనే ... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జేసీబీ బావి ప్రహారీని తవ్వుతున్నప్పుడే ఆ ఏనుగు బయటకు రావడానికి ప్రయత్నాలు చేసింది. ఏనుగు కాళ్లు పట్టేంత దారి సిద్ధం కావడంతో ఎట్టకేలకు అది దానిపై అడుగులు పెట్టి బయటకు వచ్చింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను పలువురు వీడియో తీశారు. ఈ వీడియో వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ ట్విట్టర్ లో విడుదల చేసింది.
తొలిసారి ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని సునాక్ ల సమావేశం.. జీ 20 సమ్మిట్ లో పలు ఆసక్తికర సంఘటనలు
ఈ వీడియో జంతు ప్రేమికుల మనసును దోచుకుంటోంది. అగ్నిమాపక, అటవీ శాఖ సిబ్బంది చేసిన పనిని వారు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను ‘ఏఎన్ఐ’ ట్వీట్ చేసిన వెంటనే ఇప్పటి వరకు 10 వేల వ్యూస్ వచ్చాయి. రెస్య్కూ ఆపరేషన్ చేసిన అధికారులను ట్విట్టర్ యూజర్లు ప్రశంసించారు. ఓ యూజర్ ‘మంచి పని... ఏనుగు కూడా బయటకు వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. ఆ బావిని తరువాత మూసేయాలి ” అని పేర్కొన్నారు. ‘అయ్యో బేబీ’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘బ్రేవో... ఫారెస్ట్ అధికారులకు వందనాలు’ మరొకరు కామెంట్ చేశారు.