బుర్రిపాలెం వాసులు గ్రామానికి హీరో కృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.గ్రామంలో స్కూల్ నిర్మాణంతో పాటు కళ్యాణ మండపం వంటి వాటిని నిర్మించారు.
గుంటూరు:సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో విషాదం నెలకొంది.గ్రామంతో కృష్ణకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామస్తులతో అత్యంత ఆప్యాయంగా ఉండేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామాభివృద్ధి కోసం కృష్ణ చేసిన సేవలను స్థానికులు నెమరు వేసుకుంటున్నారు.
తాను నటించిన సినిమాలపై స్థానికుల అభిప్రాయాలను కృష్ణ తెలుసుకునేవారు.తెనాలిలో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తే దేశంలో ఎక్కడైనా సినిమా విజయవంతం అవుతుందని ఆయన ధీమాతో ఉండేవారు.పద్మాలయ సంస్థ నిర్మించిన సినిమాలతో పాటు తాను నటించిన సినిమాల గురించి బుర్రిపాలెంతో పాటు తెనాలికి చెందిన వారికి ఫోన్లు చేసి సినిమాపై అభిప్రాయాలుతెలుసుకొనేవారు.మోసగాళ్లక మోసగాళ్లు సినిమా విడుదలైన మరునాడు బుర్రిపాలెం గ్రామానికి వచ్చి తల్లీదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
undefined
గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టారు.స్కూల్ తో పాటు కళ్యాణ మండపం,గీతా మందిరం కట్టించారు.డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చారని గ్రామస్తులు చెబుతున్నారు.గ్రామంలో శివాలయం నిర్మించాలని కూడా భావించారన్నారు. కరోనా సమయంలో హీరో మహేష్ బాబు చొరవతో రెండు డోసుల వ్యాక్సినేషన్ ను గ్రామస్తులకు అందించారు. గ్రామానికి తాను అండగా ఉంటానని బుర్రిపాలెం వాసులకు మహేష్ బాబు హామీ ఇచ్చిన విషయాన్ని స్థానికలు గుర్తు చేసుకుంటున్నారు.
గ్రామానికి ఎప్పుడొచ్చినా లేదాహైద్రాబాద్ లో ఎవరైనా ఈ ప్రాంతానికి చెందిన వారేవరైనా కృష్ణను కలిస్తే గ్రామం గురించి కృష్ణ అడిగి తెలుసుకొనేవారని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం ఎలా ఉంది,పంటల దిగుబడి ఎలా ఉందనే విషయమై కృష్ణ ఆరా తీసేవారు.
కృష్ణ గ్రామానికి వస్తే సందడి వాతావరణం ఉండేదని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చేవారని చెబుతున్నారు.గ్రామంలో వయస్సు తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడేవారని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. హీరో కృష్ణ మృతితో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో కృష్ణ చిత్రపటానికి పూలమాలమేసి గ్రామస్థులు నివాళులర్పించారు.