పంతాలకు పట్టింపులకు పోవద్దు, ఎక్కడో ఉంటారు: చంద్రబాబుపై అంబటి ధ్వజం

By Nagaraju penumalaFirst Published Jul 11, 2019, 2:55 PM IST
Highlights

ఇలాగే పంతాలకు పట్టింపులకు పోతే ఆ చివర బెంచిలో ఉంటారేమోనన్నారు. పంతానికి పోవద్దని సూచించారు. రామానాయుడు, అచ్చెన్నాయుడులా వ్యవహరించొద్దన్నారు. వారికి మీకు వ్యత్యాసం కనిపించాలంటూ అంబటి రాంబాబు చంద్రబాబుకు చురకలు అంటించారు.  

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను అభినందించడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శించారు. 

ముఖ్యమంత్రిని అభినందించడం, అభినందించకపోవడం ఆయన వ్యక్తిగత విషయమని అయితే అభినందించేందుకు షరతులు పెట్టడం, సాకులు వెతుక్కోవడం మంచి పద్దతి కాదన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ ను ప్రతిపక్ష నేత అభినందిస్తో బాగుండు అన్న మంత్రి మాటలకు సమాధానం చెప్పకుండా తమ ఎమ్మెల్యే స్వామికి అన్యాయం జరిగింది తేల్చమంటాడు. మరోవైపు తాము ప్రభుత్వంలో ఉండగా ప్రతిపక్ష నేతగా జగన్ ఎన్నిసార్లు అభినందించారో చెప్పాలని మరోసారి అంటారు. 

ఇలా ప్రతీదానికి చంద్రబాబు నాయుడు పంతాలకు, పట్టింపులకు, గిల్లికజ్జాలకు పోతున్నారని విమర్శించారు. ఇది మంచిపద్దతి కాదన్నారు. అలా ప్రతీదానికి పంతానికి పోయారు కాబట్టే అధికారంలో నుంచి ప్రతిపక్షానికి దిగిపోయారని ఇంకా మార్పురాలేదన్నారు. 

ఇలాగే పంతాలకు పట్టింపులకు పోతే ఆ చివర బెంచిలో ఉంటారేమోనన్నారు. పంతానికి పోవద్దని సూచించారు. రామానాయుడు, అచ్చెన్నాయుడులా వ్యవహరించొద్దన్నారు. వారికి మీకు వ్యత్యాసం కనిపించాలంటూ అంబటి రాంబాబు చంద్రబాబుకు చురకలు అంటించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక

నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్

click me!