రాజధాని రచ్చ: గోడ దూకి తప్పించుకొన్న అచ్చెన్న, గద్దె రామ్మోహన్ రావు

By narsimha lode  |  First Published Jan 10, 2020, 1:49 PM IST

విజయవాడ లో హౌస్ అరెస్ట్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, అచ్చెన్నాయుడులు శుక్రవారం నాడు తప్పించుకొన్నారు. 


అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, అచ్చెన్నాయుడులు శుక్రవారం నాడు హౌస్ అరెస్ట్ నుండి అజ్ఞాతంలోకి వెళ్లారు.  రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని మహిళలు తలపెట్టిన ర్యాలీలో పాల్గొంటామని ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Also read:మందడంలో ఉద్రిక్తత: 'ఏపీలో ఉన్నామా, పాక్‌లో ఉన్నామా'

Latest Videos

undefined

శుక్రవారం నాడు మధ్యాహ్నం విజయవాడ బెంజిసర్కిల్‌లోని జేఎసీ కార్యాలయం నుండి మహిళల ర్యాలీని నిర్వహించతలపెట్టారు. అయితే జేఎసీ కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. టీడీపీతో పాటు, జేఎసీ నేతలను పోలీసులు ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు.

Also read:విజయవాడకు పాదయాత్ర, రైతుల అరెస్ట్: గ్రామాల్లో టెన్షన్

విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గద్దె రామోహన్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  గద్దె రామోహన్ రావు ఇంటి ముందు పోలీసులు  కాపలాగా ఉన్నారు. 

Also read:సీమలో హైకోర్టు పెడితే.. పది జిరాక్స్ షాపులు వస్తాయి, ఇంకేం లేదు: జేసీ వ్యాఖ్యలు

అయితే రామోహన్ రావుతో పాటు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడులు ఇంటి వెనుక ఉన్న గోడ దూకి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడు గంటలకు మహిళల ర్యాలీలో పాల్గొనేందుకు పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


చ 

click me!