రోజా ఏపీ సీఎం జగన్ తో వేదికపైన సీరియస్ మాట్లాడడం కనిపించింది. నగరిలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. జగన్ ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు.
చిత్తూరు: ఎపీఐఐసి చైర్ పర్సన్ రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో వ్యతిరేకతను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల సొంత వైసీపీ కార్యకర్తలే ఆమెను అడద్డుకున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రోజా సీరియస్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వేదికపైనే ఆమె జగన్ తో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారు. అమ్మ ఒడది సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఎణ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడిన తర్వాత రోజా ప్రసంగించారు.
Read Also: బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్
వేదికపై జగన్ పక్కన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూర్చున్నారు. అదే వరుసలో కాస్తా దూరంలో రోజా కూర్చున్నారు. పెద్దిరెడ్డి ప్రసంగించే సమయంలో రోజా ఆయన కుర్చీలోకి వెళ్లి జగన్ తో మాట్లాడుతూ కనిపించారు.
కొద్దిసేపటి తర్వాత మంచినీళ్లు తాగాల్సిందిగా రోజాకు జగన్ సూచించారు ఆ తర్వాత ఆమెను ఊరడిస్తూ తల నిమిరాడు. ఇటీవల నగరి నియోజకవర్గంలో ఆమె పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కున్న విషయం తెలిసిందే.
Read Also: నటుడు పృథ్వీరాజ్ పై మండిపడ్డ పోసాని... స్ట్రాంగ్ వార్నింగ్
ఎంతో కాలంగా పార్టీలో ఉన్న తమను కాదని ఇతర పార్టీల వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు వారిపై రోజా కేసులు కూడా పెట్టారు. ఈ విషయం మీదనే జగన్ తో రోజా మాట్లాడినట్లు భావిస్తున్నారు.