మూడు రాజధానుల విషయమై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు.
అమరావతి:మూడు రాజధానుల విషయమై దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.బుధవారం నాడు మందడం, తుళ్లూరు గ్రామాల్లో రాజధాని కోసం రైతుల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్
ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రకటించలేదని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.
Also read:రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి
మూడు రాజధానుల విషయమై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబునాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడితే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా
ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశ్యం లేకపోతే మూడు రాజధానుల విషయమై రెఫరెండం నిర్వహించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో విజయం సాధిస్తే మూడు రాజధానులను ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతి రైతులకు ప్రభుత్వం హక్కులను కల్పించిందని బాబు గుర్తు చేశారు.
ప్రభుత్వం మారగానే రైతులు హక్కులు కోల్పోరని చంద్రబాబు చెప్పారు.