పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: మంత్రి వనితకు గాయాలు

Published : Jan 15, 2020, 03:21 PM ISTUpdated : Jan 15, 2020, 04:11 PM IST
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: మంత్రి వనితకు గాయాలు

సారాంశం

ఏపీ మంత్రి వనితకు బుధవారం నాడు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. మంత్రి వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు.


ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి వనితకు బుధవారం నాడు స్వల్పగాయాలయ్యాయి. మంత్రి కాన్వాయ్‌లోని వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రికి గాయాలయ్యాయి.

Also read:రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి

సంక్రాంతి పర్వదినం రోజున కుటుంబసభ్యులతో కలిసి మంత్రి వనిత స్వగ్రామ నుండి విజయవాడకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని మూడు జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మంత్రి వాహనం బైక్ ను ఢీకొని డివైడర్‌ను ఢీకొంది.

Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందారు. మంత్రి కాన్వాయ్‌లోని వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న మంత్రి వనితకు గాయాలయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్
పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.