15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

First Published 23, Sep 2018, 6:33 PM IST
Highlights

 విశాఖ ఏజెన్సీలో దాదాపు దశాబ్దన్నర కాలం తరువాత ప్రముఖ వ్యక్తులపై మావోయిస్టులు పంజా విసిరారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా హత్య చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 

అరకు: విశాఖ ఏజెన్సీలో దాదాపు దశాబ్దన్నర కాలం తరువాత ప్రముఖ వ్యక్తులపై మావోయిస్టులు పంజా విసిరారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా హత్య చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 14 ఏళ్ల క్రితం 2004 మార్చి 18న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మణికుమారి భర్త వెంకటరాజును దారుణంగా కాల్చి చంపారు మావోయిస్టులు. 

వెంకటరాజును హతమార్చిన తర్వాత హుకుంపేట ఎంపీపీ తమిడ రవి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు శంకర్ మరో ఎంపీపీ చిట్టి బాబును కాల్చి చంపారు. అనంతరం హోమ్ గార్డులు, ఇన్ఫార్మర్ల నెపంతో కొందరు గిరిజనులను హతమార్చడం, కొందరిని హెచ్చరిస్తూ వస్తున్నారు. 2015 అక్టోబర్ 6న ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ ముగ్గురు ప్రజాప్రతినిధులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. 

జీకే వీధి మండలం టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేశ్, జన్మభూమి కమిటీ సభ్యుడు వందనం బాలయ్యాలను అపహరించుకుపోయారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం విడుదల చేసిన 97 జీవోను రద్దు చెయ్యడంతో వారిని అక్టోబర్ 14న ఒడిశాలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. 
 
ఆ తర్వాత విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలతో స్తబ్ధుగా ఉండిపోయారు. అయితే 2016 అక్టోబర్ 23న జరిగిన ఎన్ కౌంటర్లో సుమారు 24 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తనయుడు మృతి చెందాడు. 

ఈ భారీ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులు సహజంగా తమ ప్రాభవాన్ని కోల్పోయారు. అయితే ఇటీవలే ఏవోబీలో రిక్రూట్మెంట్ చేసుకున్న మావోయిస్టులు ఆకస్మాత్తుగా అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను హతమార్చడంతో మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

పబ్లిసిటీ కోసమే మావోలు ఎమ్మెల్యేను చంపారు: రిటైర్డ్ ఐపీఎస్

Last Updated 23, Sep 2018, 6:37 PM IST