బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

By Nagaraju TFirst Published Sep 23, 2018, 5:51 PM IST
Highlights

 బాక్సైట్ తవ్వకాలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ప్రాణాలు తీసాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతమంది బడా బాబులతో కలిసి నల్ల క్వారీలు నడపడం వల్లే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేశారని తెలుస్తోంది. 

విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ప్రాణాలు తీసాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతమంది బడా బాబులతో కలిసి నల్ల క్వారీలు నడపడం వల్లే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేశారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై పెద్ద వివాదమే నడుస్తోంది. 

2015లో బాక్సైట్ తవ్వకాలపై ఏజెన్సీలో పెద్ద వివాదమే చెలరేగింది. బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలంటూ ఆదివాసీలతో పాటు మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై నిత్యం ఏజెన్సీలో ఏదో ఒక మూల నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలని ఏజెన్సీలోని నేతల్ని పలుమార్లు మావోయిస్టులు హెచ్చరించారు. 
 
అంతేకాదు 2015 అక్టోబర్ 6న మావోయిస్టులు గిరిజన నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. జీకే వీధి మండలం టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేశ్, జన్మభూమి కమిటీ సభ్యుడు వందనం బాలయ్యాలను అపహరించుకుపోయారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   
 
విశాఖ‌ మ‌న్యంలో 1212 హెక్టార్లలో బాక్సైట్ త‌వ్వకాలకు అనుమ‌తి ఇస్తూ జీవో నెంబ‌ర్ 97 విడుదలను ప్రభుత్వం రద్దు చెయ్యాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చింది. జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అక్టోబర్ 14న మావోయిస్టులు కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలను మావోయిస్టులు ఒడిశాలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో అప్పగించారు. 
 
అయితే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు క్వారీ నడపడంలో ఆరి తేరారని ప్రచారం ఉంది. హుకుంపేటలోని గూడ క్వారీ కిడారి సర్వేశ్వరరావు బావమరిది సురేష్ పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్వారీ వల్ల తమకు నష్టం జరుగుతోందని గిరిజన ప్రాంతాల ప్రజలు ఆందోళన చేపట్టారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ గ్రామస్థులకు మద్దతు పలికారు. బాక్సైట్ తవ్వకాలపై ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్  విచారణ చెయ్యాల్సి ఉంది. అయితే పీవో బదిలో ఉండటంతో సబ్ కలెక్టర్ తవ్వకాలపై విచారణ జరుపుతున్నారు. మళ్లీ తవ్వకాలపై గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చెయ్యడంతో తవ్వకాలను నిలిపివేశారు.

మైనింగ్, భూకుంభకోణాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలలో మావోయిస్టులు సర్వేశ్వరరావును హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే వాటిని పెడచెవిన పెట్టిన సర్వేశ్వరరావు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్లడంతో కాపుకాసి హతమార్చారు. 

మరోవైపు సివేరి సోమ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. సోమ జిందాల్ కంపెనీకి ఏజెంటు అంటూ ఏజెన్సీలో ప్రచారం. అరకు బాక్సైట్ విషయంలో కూడా సోము పాత్ర ఉందని నిర్ధారించడంతో మావోయిస్టులు సోమును కూడా హతమార్చినట్లు సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: ఎస్పీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

 

click me!