చంద్రబాబుకి సోనూసూద్ పరామర్శ.. హైదరాబాద్‌కి వచ్చి కలుస్తానంటూ ఫోన్‌లో ఓదార్పు

By Siva KodatiFirst Published Nov 21, 2021, 8:50 PM IST
Highlights

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రముఖ నటుడు సోనూసూద్ (sonusood) పరామర్శించారు. ఆయనకు స్వయంగా ఫోన్ చేసి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన శాసనసభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిపై అధికార వైసిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై బోరున విలపించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన ఘటనగురించి రాష్ట్రప్రజలకు తెలియజేస్తూ తన భార్య nara bhuvaneshwari పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుని chandrababu naidu కన్నీటిపర్యంతం అయ్యారు. వెక్కి వెక్కి ఏడుస్తూ తన మనసు ఎంతలా గాయపడిందో వ్యక్తపర్చారు.  

సుదీర్ఘ రాజకీయ అనుభవం, గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు కుటుంబం పట్ల వైసిపి నేతల నిండుసభలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని TDP నాయకులే కాదు సీనీ ప్రముఖులూ ఖండిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రముఖ నటుడు సోనూసూద్ (sonusood) పరామర్శించారు. ఆయనకు స్వయంగా ఫోన్ చేసి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన శాసనసభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయంలాంటి అసెంబ్లీలో విధ్వంస ధోరణి మంచిదికాదని... హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలుస్తానని ఆయన చంద్రబాబుకు తెలిపారు.

ALso Read:నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్

అంతకుముందు చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ rajanikanth పరామర్శించారు. ap assembly లో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ అసెంబ్లీ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన విచారకరమని... రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాల గురించి అసభ్యకరంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో మనోవేదరకు గురికావద్దని... ధైర్యంగా వుండాలంటూ చంద్రబాబును రజనీకాంత్ ఓదార్చారు. 

మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని... ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని AIDMK Leader ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

click me!