AP Floods: అసెంబ్లీకి రావొద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం

Siva Kodati |  
Published : Nov 21, 2021, 06:53 PM IST
AP Floods: అసెంబ్లీకి రావొద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం

సారాంశం

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ (ap floods) అల్లాడుతోన్న సంగతి తెలిసిందే. ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ (ap floods) అల్లాడుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పరిస్ధితిపై సీఎం జగన్ (ys jagan mohan reddy) అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ఆయన ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.  ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. 

పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలని సూచించారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు.. తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా వారికి విత్తనాలు, తదితరమైనవి అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

Also Read:AP Rains Update: రాగల మూడుగంటలు ఏపీ హై అలర్ట్... ఆ ప్రాంతాల్లో కుండపోత హెచ్చరిక

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి బీభత్సం సృష్టించాయి. తీరందాటిన తర్వాత క్రమక్రమంగా బలహీనపడ్డ వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ(ఆదివారం) రాగల మూడుగంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో heavy rains కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అంచనా వేసారు. ముఖ్యంగా guntur city తో పాటు ఒంగోలు, చీరాల, బాపట్ల పట్టణాల్లో వర్షతీవ్రత ఎక్కువగా వుండనున్నట్లు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 

ఇక ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు andhra pradesh ను అతలాకుతలం చేసాయి. గతంలో ఎప్పుడూ లేనంత భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసాయి. దీంతో నదులు, వాగులు వంకలు, చెరువులు కట్టలు తెంచుకుని వరద నీరు జనావాసాలపై విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల గ్రామాలకు గ్రామాలే వరదనీటిలో మునిగిపోయి పదులసంఖ్యలో ప్రజలు కొట్టుకుపోయిన విషాద ఘటనలు వెలుగుచూసాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్