ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
అమరావతి:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ బుధవారంనాడు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఈ కేసు విచారణ జరుపుతామని విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరింత సమాచారం కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. కస్టడీ పిటిషన్ తర్వాత మిగిలిన పిటిషన్లపై విచారణ నిర్వహిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావద్దని ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ కు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టుకు చంద్రబాబు లాయర్లు, సీఐడీ లాయర్లు చేరుకున్నారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్ పీటీ వారంట్లపై కూడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్న విషయం తెలిసిందే. దీంతో కస్టడీ పిటిషన్ పై తొలుత విచారణ చేపట్టనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకే వర్తిస్తాయి.
also read:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ .. విచారణ రేపటికి వాయిదా
దీంతో ఇవాళ ఈ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు చేపట్టింది.ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకే ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. అయితే అంగళ్లు కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేశారు.ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. దీంతో ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ తర్వాత విచారణ జరపాలని ఇరు వర్గాల న్యాయవాదులు కోరారు. దీంతో ఒంటి గంటకు ఇరువర్గాల న్యాయవాదులు వస్తే విచారణ ప్రారంభిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. లేకపోతే మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణను ప్రారంభిస్తామని ఏసీబీ కోర్టు ప్రకటించింది.