తిరుమల అలిపిరి నడకమార్గంలో ఎలుగు సంచారం: అప్రమత్తమైన అధికారులు

Published : Sep 20, 2023, 11:03 AM ISTUpdated : Sep 20, 2023, 11:35 AM IST
తిరుమల అలిపిరి నడకమార్గంలో ఎలుగు సంచారం: అప్రమత్తమైన అధికారులు

సారాంశం

తిరుమల అలిపిరి నడక మార్గంలో  ఎలుగుబంటి  సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.  ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.  

తిరుమల:తిరుమల అలిపిరి నడకమార్గంలో  ఎలుగుబంటి సంచారాన్ని  అటవీశాఖాధికారులు గుర్తించారు.  అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంగళవారంనాడు రాత్రి  అలిపిరి నడక మార్గంలో   ఎలుగుబంటి కన్పించింది.  బుధవారంనాడు తెల్లవారుజామున తిరుమలలో మరో చిరుతపులి  ఫారెస్ట్ అధికారులు  బంధించిన విషయం తెలిసిందే.  అయితే ఇదే ప్రాంతంలో  ఎలుగుబంటి సంచారం బయటపడడం కలకలం రేపుతుంది. అలిపిరి నడకమార్గం గుండా శ్రీవారి దర్శనం కోసం  వెళ్లే భక్తులకు  టీటీడీ  చేతికర్రలను అందిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో కూడ తిరుమలలో  ఎలుగుబంట్లు సంచరించిన  ఘటనలున్నాయి.ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన తిరుమలలోని గంగమ్మ ఆలయం వద్ద ఎలుగుబంటిని స్థానికులు గుర్తించారు.  తిరుమల అలిపిరి నడక మార్గంలో  ఎలుగుబంటి  సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తిరగవద్దని  అధికారులు  సూచించారు. మరో వైపు ఈ ఏడాది ఆగస్టు 21న  అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగు బంటి  కన్పించింది.  దీంతో భక్తులు భయాందోళనలు చెందారు.  అలిపిరి ఏడో మైలు రాయి వద్ద ఎలుగుబంటిని  భక్తులు గుర్తించారు.  వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.  ఈ మార్గంలో  తిరుమలకు వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు పారెస్ట్ అధికారులు.తిరుమల నడక మార్గంలో  అడవి జంతువులు  భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

అలిపిరి మార్గంలో  ఇప్పటికే  ఆరు చిరుతలను  అటవీశాఖాధికారులు బందించారు. ఎలుగు బంట్ల సంచారంపై భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో అడవి జంతువులు  తిరగకుండా  అటవీ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.  అలిపిరి నడక మార్గంలో  ఉన్న  అటవీ మార్గంలో  ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని  టీటీడీ భావిస్తుంది.ఈ మేరకు  కేంద్ర అటవీశాఖకు  టీటీడీ వినతి పత్రం పంపింది.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు