టీటీడీ చరిత్రలో రికార్డ్.. తొలిసారి రూ.5 వేల కోట్లు దాటిన ఆలయ వార్షిక బడ్జెట్

By Sairam Indur  |  First Published Jan 30, 2024, 12:53 PM IST

టీటీడీ (TTD) చరిత్రలోనే మొదటి సారిగా వార్షిక బడ్జెట్ రూ.5 వేల కోట్లు దాటింది. సోమవారం నిర్వహించిన టీటీడీ (Tirumala tirupati devasthanam) బోర్డు సమావేశం రూ. 5,141.74 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోద ముద్ర వేసింది.


తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం రూ.5 వేల కోట్లు దాటింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవన్ లో ధర్మకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో 2024-2025 సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్ల బడ్జెట్ అంచనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది.

గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. ఫాస్టెస్ట్ రూట్ లో వెళ్తే మెట్లపైకి తీసుకెళ్లి.. వీడియో వైరల్

Latest Videos

వార్షిక బడ్జెట్ రూ.5,000 కోట్లు దాటడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. బడ్జెట్ అంచనాల్లో హుండీ ద్వారా  రూ.1611 కోట్లు వస్తాయని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ట్రస్ట్ రూ.14,000 కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కలిగి ఉంది. దీనికి వడ్డీ రూపంలో రూ.1,167 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. అలాగే ప్రసాదాల విక్రయం ద్వారా రూ.600 కోట్లు, దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.338 కోట్లు, ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్సులు, ఈఎండీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తదితరాల ద్వారా రూ.246.39 కోట్లు, ఇతర మూలధన రశీదుల ద్వారా రూ.129 కోట్లు, రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేస్తోంది. అలాగే ఆర్జిత సేవా టికెట్ల విక్రయం ద్వారా రూ.150 కోట్లు, కల్యాణకట్ట రశీదుల ద్వారా రూ.151.5 కోట్లు సమకూరుతుందని భావిస్తోంది.

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. మీ జిల్లాకు ఎవరొచ్చారో తెలుసా ?

వివిధ ట్రస్టు రశీదుల ద్వారా రూ.85 కోట్లు, అద్దెలు, ఎలక్ట్రికల్, ఇతర రశీదుల ద్వారా రూ.60 కోట్లు, టోల్ ఫీజు వసూళ్లు తదితర ఇతర రశీదుల రూపంలో రూ.74.5 కోట్లు, ప్రచురణ రశీదుల ద్వారా రూ.35.25 కోట్లు ఆర్జించాలని బోర్డు భావిస్తోంది. మానవ వనరుల చెల్లింపుల కోసం ట్రస్ట్ రూ .1,733 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది మొత్తం సంవత్సరం హుండీ వసూళ్ల కంటే రూ .122 కోట్లు ఎక్కువ.

కొత్త పార్టీ పెట్టనున్న విజయ్ దళపతి.. పేరు కూడా ఖరారు..

మెటీరియల్ కొనుగోళ్లకు రూ.751 కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.750 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు రూ.350 కోట్లు, శ్రీనివాస సేతు పనులకు రూ.53 కోట్లు, ఎస్ వీ ఐఎంఎస్ హాస్పిటల్ లో ఇంజినీరింగ్ పనుల నిర్వహణకు రూ.60 కోట్లు, అదే హాస్పిటల్ కు గ్రాంట్ గా రూ.60 కోట్లు, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ పనులకు రూ.190 కోట్లు కేటాయించారు.  ఫెసిలిటీ మేనేజ్ మెంట్ సేవలకు రూ.80 కోట్లు, వివిధ సంస్థలకు గ్రాంట్లు ఇచ్చేందుకు రూ.113.5 కోట్లు, హిందూ ధర్మప్రచార పరిషత్ కు రూ.108.5 కోట్లు, రుణాలు, అడ్వాన్సులు, ఈఎండీ తదితరాలకు రూ.166.63 కోట్లు, పింఛన్లు, ఈహెచ్ ఎస్ ఫండ్ కంట్రిబ్యూషన్లకు రూ.100 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.62 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలుగా రూ.50 కోట్లు, టెండర్ పబ్లికేషన్లు, ప్రకటనల కోసం రూ.10 కోట్లు టీటీడీ జమ చేయనుంది. 

click me!