యువనేత బర్త్‌డే వేడుకలు: రావులపాలెంలో 25 మందికి కరోనా

By narsimha lode  |  First Published Jul 19, 2020, 3:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట నియోజకవర్గంలోని ఓ యువనేత బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 25 మందికి కరోనా సోకింది. దీంతో ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలకు క్యూ కట్టారు.



కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట నియోజకవర్గంలోని ఓ యువనేత బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 25 మందికి కరోనా సోకింది. దీంతో ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలకు క్యూ కట్టారు.

కొత్తపేట నియోజకవర్గంలోని ఓ పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రావులపాలెంలో ఆ నేతతో పాటు మరో 25 మందికి కరోనా సోకింది. 

Latest Videos

undefined

also read:బాలినేని వ్యాఖ్యలు: ఒంగోలులో టీడీపీకి స్కెచ్ వేశాడా?

రావులపాలెంలో ర్యాపిడ్ టెస్టు కిట్స్ తీసుకొచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. తమకు కరోనా వచ్చిందేమోననే భయంతో కరోనా పరీక్షలు నిర్వహించుకొనేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 

also read:కరోనా భయం: కిడ్నీ రోగిని చేర్చుకోని ప్రైవేట్ ఆసుపత్రి, మెట్లవద్దే మృతి

కరోనా నిబంధనలను బ్రేక్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పలువురు ప్రముఖులు కూడ పాల్గొన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వీరు కూడ కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు 44,609కి చేరుకొన్నాయి. శనివారం నాడు ఒక్క రోజే 3,963 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివవరకు రాష్ట్రంలో కరోనాతో 586 మంది మరణించారు.రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 

click me!