ఏపీలో రెండు ఎమ్మెల్సీలకు పేర్లు: రవీంద్రబాబు, జకియా ఖానుంలకు ఛాన్స్?

By narsimha lodeFirst Published Jul 19, 2020, 2:25 PM IST
Highlights

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు వైసీపీ నాయకత్వం ఇద్దరి పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేయనుంది.

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు వైసీపీ నాయకత్వం ఇద్దరి పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేయనుంది.

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పదవుల్లో ఒక పదవిని ఎస్‌సీ సామాజిక వర్గానికి  మరో పదవిని మైనార్టీలకు ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయంం తీసుకొంది.

2019 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మైనార్టీ వర్గం నుండి జకియా ఖానుం పేర్లను వైసీపీ నాయకత్వం ఖరారు చేసిందనే ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

also read:బాలినేని వ్యాఖ్యలు: ఒంగోలులో టీడీపీకి స్కెచ్ వేశాడా?

రవీంద్రబాబుకు ఎంపీ టిక్కెట్టు ఇవ్వలేకపోయాడు. ఆ సమయంలోనే రాజ్యసభకు పంపుతామని వైసీపీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే రాజ్యసభ టిక్కెట్టు ఆయనకు దక్కలేదు. 

ఎమ్మెల్సీగా రవీంద్రబాబు పేరును ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం పనిచేసిన జకియా ఖానుం భర్త మరణించాడు. దీంతో ఆ కుటుంబానికి న్యాయం చేసే ఉద్దేశ్యంతో ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారని అంటున్నారు.గవర్నర్ కోటాలో వీరిద్దరి పేర్లను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు గవర్నర్ కు పంపనున్నారని చెబుతున్నారు. 

click me!