తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. కరోనా భయంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రాలేదు. ఆసుపత్రి మెట్ల వద్దే బాధితుడు మరణించాడు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. కరోనా భయంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రాలేదు. ఆసుపత్రి మెట్ల వద్దే బాధితుడు మరణించాడు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన శివనారాయణ అనే వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. వ్యాధితో తీవ్ర ఇబ్బందిపడడంతో ఆసుపత్రిలో చేరేందుకు ఆదివారం నాడు ఇంటి నుండి బయలుదేరాడు.
undefined
also read:తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌కి కరోనా: మూడో సారి పరీక్షలో తేలిన కోవిడ్
పిఠాపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు భార్యతో కలిసి శివనారాయణ వచ్చాడు. అయితే కరోనా భయంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చుకోలేదు.
108 కు బాధితుడి ఫోన్ చేసింది. కానీ అంబులెన్స్ సిబ్బంది నుండి సానుకూల స్పందన రాలేదని బాధితుడి భార్య ఆరోపిస్తున్నారు. గంట పాటు ఆసుపత్రికి వెళ్లేందుకు ఆమె అక్కడే వాహనం కోసం ఎదురు చేసింది.
గంట పాటు ప్రైవేట్ ఆసుపత్రి మెట్ల వద్దే భర్తతో అక్కడే కూర్చొంది. ఆసుపత్రి మెట్ల వద్దే శివనారాయణ ఆదివారం నాడు మరణించాడు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ లు కూడ నిరాకరించాయి. చివరకు ఓ ప్రైవేట్ అంబులెన్స్ వచ్చింది. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో డెడ్‌బాడీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు.