ప్రాణం విలువ తనకు తెలిసినందునే ఆరోగ్యశ్రీ లో మార్పులు చేసి ప్రతి పేదవాడికి వైద్యం అందేలా చర్యలు తీసుకొన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసులను కూడ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్టుగా ఆయన ప్రకటించారు.
అమరావతి: ప్రాణం విలువ తనకు తెలిసినందునే ఆరోగ్యశ్రీ లో మార్పులు చేసి ప్రతి పేదవాడికి వైద్యం అందేలా చర్యలు తీసుకొన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసులను కూడ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్టుగా ఆయన ప్రకటించారు.గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. అంతకు ముందు కరోనాతో మరణించిన వారికి ఏపీ అసెంబ్లీ సంతాపాన్ని తెలిపింది. ఆరోగ్యశ్రీలో 2400 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రాణం విలువ తెలిసినందున ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
also read:ఏపీ బడ్జెట్: ఈబీసీతో పాటు పలు రంగాలకు అధిక కేటాయింపులు
వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించానని చెప్పారు. 1180 వాహనాలు వైద్య సేవలో నిమగ్నమయ్యాయని ఆయన తెలిపారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను నియమించామన్నారు. ఆరోగ్యశ్రీలో 2400 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రతి పీహెచ్‌సీ సెంటర్ కి 104 వాహనం కేటాయించినట్టుగా చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రోజూ లక్ష టెస్టులు చేస్తున్నట్టుగా చెప్పారు. త్వరలో టీచింగ్ నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తామన్నారు. కరోనా చికిత్స కోసం 47వేల 285 బెడ్స్ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు సీఎం. నాడు నేడు కార్యక్రమంతో ఆసుపత్రుల రూపు రేఖలను మార్చుతున్నామని ఆయన వివరించారు.
ఆక్సిజన్ కొరత లేకుండా ఎంతైనా ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైద్య సిబ్మంది పనిచేయడం వల్లే రాష్ట్రంలో కరోనాతో మరణాల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్ లు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.