ఇక గుంటూరులోనే రెమ్‌డిసివర్ తయారీ... వైసీపీ ఎంపీ లేఖకు కేంద్రం అనుమతి

By Siva KodatiFirst Published May 20, 2021, 2:24 PM IST
Highlights

గుంటూరు జిల్లా రెమ్‌డిసివర్ తయారీకి కేంద్రంగా మారబోతోంది. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేంద్రంగా పనిచేస్తున్న సేఫ్ ఫార్మాలో రెమ్‌డిసివర్ ఇంజెక్షన్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తం 5 లక్షల డోసుల తయారీకి కేంద్రం గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.

అనుమతి ఇవ్వాలంటూ నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు కేంద్రానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన కేంద్రం  ఈ మేరకు అనుమతి ఇచ్చింది. కాగా, కరోనా చికిత్సలో రెమ్‌డిసివర్ మంచి ఫలితాలను ఇస్తున్న సంగతి తెలిసిందే.

భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ బాధితులు పెరిగిపోవడంతో ఈ ఔషధానికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. బ్లాక్ మార్కెట్‌లో దీని ధర లక్షల్లో పలుకుతోంది. దీనిని అదునుగా చేసుకుని కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 

click me!