
బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఇందులో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులకు కీలక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టను భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.