మొక్కజొన్న పంటకు వివిధ దశల్లో ఆశించే పురుగులు, నివారణ చర్యలు ఇవే!

By Navya ReddyFirst Published Feb 25, 2022, 3:45 PM IST
Highlights

మొక్కజొన్న పంటలు (Corn crops) పండించుకోవడానికి నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో మొక్కజొన్నను ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో ఈ పంటను జూన్ మొదటి వారం నుంచి  జులై 15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న సాగులో దశల్లో ఆశించి పురుగుల ఉదృతి కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. వాటి నివారణ చర్యలు (Preventive measures) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 
ఎకరానికి 7 నుంచి 10 కిలోల మొక్కజొన్న విత్తనాలు సరిపోతాయి. నీరు ఇంకనీ నల్ల భూములు, వర్షాధారిత ఎర్ర నేలలు, ఆమ్లక్షార, చౌడు భూములు మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉండవు. తేమ (Moisture), ఉష్ణోగ్రత (Temperature) అధికంగా ఉన్న వాతావరణంలో మొక్కజొన్న పంటకు తెగుళ్లు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కనుక రైతులు వాటి నివారణ చర్యలను తీసుకుంటే మొక్కజొన్న సాగు అత్యధిక ఉత్పత్తిని పొందవచ్చు.

Latest Videos

బూజు తెగులు: మొక్కజొన్న పంటను బూజు తెగులు (Powdery mildew) ఆశించినట్లయితే ఆకులు వంకలు తిరిగి, ముడతలు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తెగలను గమనించి వాటి నివారణ కోసం టలాక్సిల్ (Talaxyl) 4గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అదే మొక్కలపై బూజు తెగుళ్లు కనిపిస్తే మెటలాక్సిల్ 2గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేస్తే బూజు తెగులు తగ్గి మొక్కజొన్న పంట సాగు బాగుంటుంది.

కాండం తొలుచు పురుగులు: మొక్కజొన్న పంటకు ఈ తెగులు పూత దశ నుంచి సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు కాండంపై గోధుమ రంగు చారలు (Brown stripes) ఏర్పడి పంట కోతకు రాకముందే కాండం (Stem) భాగం తిరిగి నేలపై పడిపోతుంది. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపలి బెండు భాగం కుళ్లి నలుపు రంగులోకి మారుతుంది. వీటి నివారణ కోసం ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి. పంటకోత తర్వాత తెగులు ఆశించిన మొక్క భాగాలను కాల్చివేయాలి.

ఆకు ఎండు తెగులు: ఆకు ఎండు తెగులు రెండు రకాలు.

మొదటి రకం ఆకు ఎండు తెగులు: ఆకు ఎండు తెగులు రెండు రకాలు. మొదటి రకం తెగుళ్లు ఆకులపై కోలగా మచ్చలుగా ఉండి నీటితో తడిచినట్లుగా అనిపించి క్రమంగా ఈ మచ్చ  పరిమాణం (Scar size) పెరుగుతుంది. క్రమేపీ ఆకు మొత్తం వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలో (Humid climate) మొక్కలు చనిపోతాయి. కనుక తేమ లేకుండా చూసుకోవాలి.

రెండవ రకం ఆకు ఎండు తెగులు: ఆకులపై కోలగా చిన్న చిన్నగా ఉండే బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తరువాత ఈ మచ్చల పరిమాణం (size of the spots) పెరిగి దీర్ఘచతురస్రాకారంలో మారుతాయి వాతావరణంలో అధిక తేమ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ తెగలు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ తెగల నివారణ కోసం మాంకోజెబ్ (Mancozeb) 2.5గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

click me!