సూపర్ స్టార్ కృష్ణ గురించి ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ. టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ ఆయన సొంతం. , అభిమానుల ఆరాధ్య దైవం, సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఘట్టమనేని కృష్ణకు సబంధించిన ఓ 10 అద్భుతాల గురించి ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కృష్ణ 1943 మే 31 న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ 5 దశాబ్దాల కెరీర్‌లో 350 పైగా సినిమాల్లో నటించారు. విజయనిర్మలతో 48, జయప్రదతో 47 సినిమాలు చేశారు కృష్ణ.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఫస్ట్ హీరోగా ఘట్టమనేని కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. కాని అక్కడ ఎక్కువ సినిమాలు చేయలేదు కృష్ణ. ఇక ఘట్టమనేని కృష్ణ నటించిన అనేక విజయవంతమైన చిత్రాలు, జీతేంద్ర ప్రధాన పాత్రలో హిందీలో రీమేక్ అయ్యాయి. కృష్ణ సినిమాలను ఎక్కువగా హిందీలో రీమేక్ చేసిన నటుడు జితేంద్ర.
ఘట్టమనేని కృష్ణ సినిమా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో విశేషంగా గుర్తింపు పొందారు. వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలను నిర్మించి, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన మొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు.
ఇక సూపర్ స్టార్ కృష్ణ పేరుతో ఉన్న మరో రికార్డ్ ఏంటంటే.. ఎక్కువ సినిమాల్లో ఆయన డబుల్, ట్రిపుల్ రోల్స్ చేశారు. 25 చిత్రాల్లో డబుల్ రోల్ చేసిన కృష్ణ, 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్‌లో నటించి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
తెలుగు సినిమా పరిశ్రమలో పలు సాంకేతిక మార్పులు తీసుకొచ్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో ఫస్ట్ సినీమాస్కోప్ 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు. 1986లో వచ్చిన 'సింహాసనం' సినిమా తొలి 70mm చిత్రం, 1988లో వచ్చిన తెలుగు వీర లెవారా' చిత్రం తొలి DTS చిత్రం గా గుర్తింపు పొందాయి.
ఘట్టమనేని కృష్ణ నటించిన 'సింహాసనం' సినిమా ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు 70mm థియేటర్లలో 100 రోజుల పాటు నడిచిన ఫస్ట్ మూవీగా రికార్డ్ సాధించింది. అంతే కాదు టాలీవుడ్ కు ఫస్ట్ కౌబాయ్ హీరో కూడా సూపర్ స్టార్ కృష్ణనే.
సినిమాలతో పాటు రాజకీయంగా కూడా తనదైన మార్క్ చూపించారు కృష్ణ. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
కెరీర్ లో ఎన్నో గౌరవాలు పొందిన సూపర్ స్టార్ కృష్ణకు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు గౌరవ సూచికంగా పోస్టేజ్ స్టాంప్‌ను విడుదల చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ విశ్రాంతి లేకుండా పనిచేసేవారు. రోజుకు మూడు , నాలుగు షిప్ట్ లు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లో ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన రికార్డ్ కూడా కృష్ణ సొంతం. ఒక ఏడాది అయితే ఏకంగా 17 కృష్ణ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఘట్టమనేని కృష్ణ నిర్మాతల పాలిట దేవుడిగా నిలిచారు. ఎంతోమంది డబ్బులు ఇవ్వకపోయినా చూసీ చూడనట్టు వదిలేసేవారు, తన సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలకు మరో సినిమా అవకాశం ఇచ్చేవారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన వారసత్వం తీసుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. కృష్ణ వారసులుగా ఆయన తమ్ముడు, కూతురు, కొడుకులు, మనవలు, ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
2022 నవంబర్ 15న గుండెపోటుతో ఘట్టమనేని కృష్ణ మరణించారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో చేసిన అనేక మార్పులకు, ఆయన చేసిన కృషి, మైలురాయిగా నిలిచింది.