శ్రీలీల తాజాగా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ, ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించడంతో అభిమానుల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఫోటోలలో ఆమె ముఖంపై హల్దీతో కనిపిస్తున్నారు. చుట్టూ కుటుంబ సభ్యులు సందడిగా కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పెళ్లి తంతులా అనిపిస్తోంది.
సీక్రెట్ గా శ్రీలీల నిశ్చితార్థం ?
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసిన ఫొటోలలో శ్రీలీల ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె చెంపలపై పసుపు పూసి ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా సాధారణంగా నిశ్చితార్థం, పెళ్లి వేడుకల్లో జరుగుతుంది. దీనితో శ్రీలీల నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగిందా ? ఆమె పెళ్ళికి రెడీ అవుతోందా ? అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి.
శ్రీలీల కూడా అందుకు తగ్గట్లుగా హింట్స్ ఇచ్చింది. ఇది నాకు బిగ్ డే.. కమింగ్ సూన్ అని పోస్ట్ చేసింది. దీనితో శ్రీలీల నిశ్చితార్థం పూర్తయింది అని ఇప్పుడు పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తోంది అని నెటిజన్లు అంటున్నారు.
కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ ?
ఈ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల కొంత కాలంగా శ్రీలీల, బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఓ సినిమా భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం పేరు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు కానీ, చాలా మంది ఇది అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆషికీ 3’ అని భావిస్తున్నారు.
శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ నిశ్చితార్థం సైలెంట్ గా జరిగిపోయింది అని కొందరు భావిస్తున్నారు. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాక.. ఒక సందర్భంలో కార్తీక్ ఆర్యన్ తల్లి.. మా ఇంటికి కోడలు రాబోతోంది అని హింట్ ఇచ్చారు. అయితే శ్రీలీల ఎంగేజ్మెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అది ఎంగేజ్మెంట్ కాదని, యాడ్ షూట్ అయి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. అయితే దేనిపైనా శ్రీలీల అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అందరినీ కన్ఫ్యూజన్ లో నెట్టేలా పోస్ట్ పెట్టింది.