అనుష్క శెట్టి, క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న `ఘాటి` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీమ్‌.

అనుష్క శెట్టి ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఆమె చివరగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించింది. ఈ మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది. తాజాగా ఇప్పుడు `ఘాటి` అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

అయితే ఇందులో గతంలో ఎప్పుడూ చూడని అనుష్కని మనం చూడబోతున్నాం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ కనిపించింది. వెన్నులో వణుకు పుట్టించింది. ఇంటెన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది అనుష్క.

అనుష్క శెట్టి `ఘాటి` మూవీ రిలీజ్‌ డేట్‌

దీంతో `ఘాటి` సినిమాపై ఈ గ్లింప్స్ అంచనాలను పెంచింది. గ్లింప్స్ లోనే ఇలా ఉంటే ఇక మూవీలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ పెరిగింది. 

ఈ క్రమంలో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. జులై 11న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది.

ఆకట్టుకుంటున్న అనుష్క శెట్టి `ఘాటి` కొత్త పోస్టర్‌

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది టీమ్‌. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.

`వేదం` తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌ లో వస్తున్న మూవీ `ఘాటి`

'ఘాటి' .. అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ సక్సెస్ ఫుల్ మూవీ 'వేదం' తర్వాత కలిసిన చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. `ఘాటి` సినిమా జులై 11న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.