తక్కువ ధరలో మంచి బ్యాటరీ లైఫ్‌తో రోజువారీ పనులకు సరిపోయే ఫోన్ కావాలా? అయితే మీకు జియో ఫోన్లే బెస్ట్ ఆప్షన్. రూ.5,000 కంటే తక్కువకే స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో కీప్యాడ్ ఫోన్లను అందిస్తోంది. ఆ మోడల్స్ గురించి డీటైల్డ్ గా తెలుసుకుందాం రండి.  

ఈ సంవత్సరం జియో చాలా మోడల్స్‌ని రిలీజ్ చేసింది. అవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో అన్ని అవసరాలకి తగ్గట్టుగా ఉన్నాయి. కేవలం కాల్స్, మెసేజెస్‌ కోసమే కొన్ని ఫోన్లు ఉన్నాయి. 4G ఇంటర్నెట్‌తో పనిచేసే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది రిలీజ్ చేసిన కొన్ని తక్కువ బడ్జెట్ ఫోన్ల ఫీచర్స్, ధరలు ఇప్పుడు పరిశీలిద్దాం. 

జియో ఫోన్ ప్రైమా 2 4G

జియో ఫోన్లలో అతి తక్కువ ధర ఫోన్ జియో ఫోన్ ప్రైమా 2 4G. దీని ధర కేవలం రూ.2,799. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే సింగిల్ సిమ్, 4G, VoLTE, Wi-Fi ఉన్నాయి. 512 MB RAM, 4GB స్టోరేజ్ ఉంది. మెమరీ కార్డ్‌తో 128GB వరకు పెంచుకోవచ్చు. 2.4 ఇంచెస్ స్క్రీన్, 240×320 పిక్సెల్స్ రిజల్యూషన్. 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. 2000mAh బ్యాటరీ కూడా ఉంది. KaiOS 2.5.3, బ్లూటూత్ కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కావాలనుకున్న వారికి ఇదే బెస్ట్ ఫోన్. 

జియో ఫోన్ 3

ఇంకాస్త మంచి ఫోన్ కావాలంటే జియో ఫోన్ 3 బెస్ట్. దీని ధర రూ.4,499. ఈ ఫోన్ క్వాడ్ కోర్ 1.4GHz ప్రాసెసర్, డ్యూయల్ సిమ్, 3G, 4G ఉన్నాయి. 2GB RAM, 64GB స్టోరేజ్ ఉంది. 5 ఇంచ్ HD డిస్‌ప్లే (720×1280 పిక్సెల్స్)తో వస్తుంది. 5MP బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 2800mAh బ్యాటరీ కెపాసిటీతో పనిచేసే ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 8.1 Oreo OS ఉంది.

జియో ఫోన్ నెక్స్ట్

కొత్తగా వచ్చిన జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ.4,999 మాత్రమే. ఈ ఫోన్ లో క్వాల్కమ్ 215 ప్రాసెసర్ పాటు 3GB RAM, 32GB స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 5.45 ఇంచ్ HD+ డిస్‌ప్లే, 13MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 3500 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 OS ఉన్నాయి.

జియో ఫోన్ ప్రైమా 4G

బేసిక్ జియో ఫోన్ అయిన జియో ఫోన్ ప్రైమా 4G ధర కేవలం రూ.2,749. 512MB RAM, 4GB స్టోరేజ్, 2MP బ్యాక్ కెమెరా, 0.3MP ఫ్రంట్ కెమెరా ఫీచర్లతో అతి తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫోన్ లభిస్తుంది. దీనికి 4G సపోర్ట్ కూడా ఉంది. ఇందులోనే మరో మోడల్ ధర రూ.3,990. ఇది ప్రైమా 2 లాంటిది. దీని బ్యాటరీ లైఫ్ ఇంకాస్త బాగుంటుంది.