Asianet News TeluguAsianet News Telugu

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

తూర్పు గోదావరి దేవీపట్నం-కచలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు వరంగల్ వాసులు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ప్రమాదం నుండి మురళి బయటపడ్డాడు.

how boat capsized at devipatnam reveals eye witness
Author
Warszawa, First Published Sep 15, 2019, 5:04 PM IST

దేవీపట్నం: దేవీపట్నం-కచలూరు వద్ద పడవ ఓ పక్కకు ఒరుగుతూ నీళ్లలా ముగినిపోయిందని ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన మురళి చెప్పారు.

ప్రమాదం నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. కచలూరు వద్దకు బోటు రాగానే పడవ ఒక వైపుకు ఒరిగిపోయిందని ప్రమాదం నుండి బయట పడిన ఆయన  చెప్పారు. కొద్దిసేపట్లోనే పడవ మొత్తం నదిలో మునిగిపోయిందని మురళి చెప్పారు.

దీంతో తాము పడవ పైకి ఎక్కినట్టుగా ఆయన చెప్పారు. పడవపైకి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో  బ్యాలెన్స్ కాకపోవడంతో కొందరు నీటిలో పడిపోయారని ఆయన చెప్పారు.

మరో వైపు మొండిగా పడవపై తనతో పాటు కొందరు ఉన్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో ఓ పడవ రావడంతో తాము ప్రాణాలతో బయటపడినట్టుగా ఆయన తెలిపారు. వరంగల్ నుండి  14 మందిమి పాపికొండలు చూసేందుకు వచ్చామన్నారు.  ఐదుగురు మాత్రమే బయట పడ్డామని మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు.
 

సంబంధిత వార్తలు

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios