Asianet News TeluguAsianet News Telugu

#RRR:తారక్ క్యారెక్టర్ గుట్టు లాగిన స్టీవెన్స్..!

మల్టీస్టారర్ కథలు ఎన్నొచ్చినా ప్రస్తుతం ఆడియెన్స్ ద్రుష్టి మొత్తం #RRR పైనే ఉందని చెప్పాలి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఎలా కనిపిస్తారనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. 

tharak fitnes trainar  Lloyd Stevens meets rajamouli
Author
Hyderabad, First Published Oct 22, 2018, 3:51 PM IST

మల్టీస్టారర్ కథలు ఎన్నొచ్చినా ప్రస్తుతం ఆడియెన్స్ ద్రుష్టి మొత్తం #RRR పైనే ఉందని చెప్పాలి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఎలా కనిపిస్తారనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. జక్కన్న సినిమా గురించి కొంచెం కూడా చెప్పడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

దీంతో అభిమానులు కూడా ఆయన మీద ఎక్కువగా ఆశాలు పెట్టుకోలేదు గాని అప్పుడపుడు పాత్రలకు సంబందించిన రూమర్స్ గురించి బాగానే చర్చించుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తారక్ పాత్ర గురించి తెలుసుకోవడానికి డైరెక్ట్ గా రాజమౌళి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో కాదు. తారక్ యొక్క ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. 

ఎన్టీఆర్ పాత్ర సినిమాలో ఎప్పుడు చూడని విధంగా ఉంటుందట. ముఖ్యంగా ఫిట్ నెస్ లో చాలా మార్పులు కనిపిస్తాయని సమాచారం. అందుకోసం స్టీవెన్స్ సమక్షంలో కసరత్తులు చేస్తున్నాడు తారక్. ఇక రీసెంట్ గా రాజమౌళిని కలిసి స్టీవెన్ తారక్ లుక్ ఎలా ఉండాలనే విషయంపై చర్చలు జరిపాడు. తారక్ పాత్ర గురించి ఈ విదేశీ ట్రైనర్ గుట్టు మొత్తం లాగేశాడట. 

రాజమౌళి కూడా ఎప్పటినుంచో స్టీవెన్స్ తో మాట్లాడాలని అనుకుంటున్నాడు. కానీ కథపై కసరత్తులు ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇక స్టీవెన్స్ ముందే తెలుసుకుంటే బెటర్ అని తారక్ సలహాతో జక్కన్నతో చర్చలు జరిపాడు. ఇక అరవింద సమేత హడావుడి కూడా అయిపోవడంతో ఎన్టీఆర్ బయటి జనాలకు ఎక్కువగా కనిపించే వీలు లేకుండా సీక్రెట్ గా కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి 

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు

Follow Us:
Download App:
  • android
  • ios