Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కు మళ్లీ కోపమొచ్చింది

 పోలవరంప్రాజక్టు పూర్తయి నీళ్లతో ఎపుడు నిండుతుందో గాని,  ముఖ్యమంత్రి  ఆగ్రహం,అసంతృప్తి ప్రాజక్టులోకి దండిగా పారుతున్నాయి. ప్రతిసోమవారం పోలవరం ప్రాజక్టుమీద రివ్యూ చేసినపుడల్లా  పనులు నత్తనడక అని అరుస్తుంటాారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉంటారు. బ్లాక్ లిస్టులో పెట్టమంటుంటారు. అదెపుడూ జరగదు. ఇదంతా ఒక డ్రామా లాగా తోస్తుంది. ఎందుకంటే, ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పిస్తున్న పోలవరం కాంట్రాక్టరెవరు? ఒక టిడిపి నాయకుడేనా... ఈ రోజు రివ్యూ విశేషాలు చదవండి.

cM naidu unhappy over slow pace polavaram earth  work

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రతి సోమవారం  సమీక్షిస్తుంటారు.  పని ఎలాజరిగిందో అధికారులను అడిగి తెలుసుకుంటంటారు.  ఈ సమీక్ష ఎంత ఆషామాషీగా కాదు, యమ సీరియస్ యవ్వారం అని చెప్పడానికి, పెద్ద ఆర్భాటం చేయడానికి అపుడపుడు డ్రోన్స్   ను ప్రాజక్టు ప్రాంతంలోతిప్పి వాటి ఫోటోలను ఆయన అమరావతి లోని  తన ఆఫీసులో కూర్చుని చూస్తూ సమీక్షిస్తుంటారు. ఇది చూస్తే  పోలవరం సమీక్ష ఎంత హైటెక్కో  అనిపిస్తుంది. ఇదంతా చెప్పి సోమవారం  అంటే పోలవారం  అని కూడా చెప్పుకుంటుంటారు ముఖ్యమంత్రి  ప్రచార బృందం.

 

 ఇప్పటికి ఎన్ని సోమవారాలలో ఆయన పోలవరాన్ని రివ్యూచేశారో అన్ని సార్లు  ప్రాజక్టు పనుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పోలవరం  పనులు మందకొడిగా జరుగుతున్నాయని, దీనిని సహించనని  చెబుతుంటారు. పని సరిగ్గాచేయని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టు లోపెట్టండని హూంకరిస్తూ ఉంటారు. ఇంతవరకు ఎవరినీ బ్లాక్ పెట్టింది లేదు. అది కష్టం కూడా ఎందుకంటే, పోలవరంకాంట్రాక్టర్ ముఖ్యమంత్రికి, పార్టీకి అన్నివిధాల దగ్గరి వాడు. అందుకే ముఖ్యమంత్రి సమీక్ష పెద్ద డ్రామా యేమో అనిపిస్తుంది.

 

తాజాగా ఈ రోజు అంటే  మే ఒకటో తేదీన,సోమవారం కాబట్టి ఒక రివ్యూ జరిగింది.ఆ రివ్యూ లో కూడా ఎప్పటిలాగే ఆయన తీవ్ర అసంతృప్తి ఆగ్రహ జ్వాలలు వెల్ల గక్కారు. ఎప్పటిలాగే. దీని మీద ముఖ్యమంత్రి సమాచార విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిగో సమీక్ష వివరాలు :

 

“ఎర్త్ వర్క్ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా లక్ష్యాన్ని చేరుకోలేక అంతులేని కాలయాపన చేస్తున్నారని, దీనికి నిర్మాణ సంస్థలు చెప్పే సమాధానాలు కూడా అర్థవంతంగా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.పనుల ఆలస్యానికి సంబంధించి ప్రతి సమీక్షలోనూ చెప్పిన కారణాలనే చెబుతున్నారే తప్ప పురోగతి మాత్రం చూపించడం లేదని అన్నారు.పోలవరం మట్టి తవ్వకం సహా మిగిలిన అన్ని పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.”

 

"సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్, గేట్ల ఫాబ్రికేషన్ పనులు కొంతవరకు ఆశాజనకంగానే వున్నా ఎర్త్ వర్క్, కాఫర్ డ్యాం పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయంటూ ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులపై మండిపడ్డారు.

 

  పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి 2018 డిసెంబరు నాటికల్లా గ్రావిటీ ద్వారా నీరు అందించాలన్న సదుద్దేశంతో సహకరిస్తున్నామని, అయినా నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఈ తీరు సరికాదని ముఖ్యమంత్రి హితవు చెప్పారు.

 

***

ఈ  ధోరణి వల్లే చివరకు పార్టీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి కి కూడా పోలవరం 2018 కల్లా పూర్తవుతుందంటే అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి కావాలంటే ఆయన్ను ఎలక్షనల్లో మళ్లీగెలిపించాల్సిందేనని కూడా ఆయన అనంతపురం సభలో ముఖ్యమంత్రి ఎదుటే అని చప్పట్లు కొట్టించుకున్నారు.

 



 

 

Follow Us:
Download App:
  • android
  • ios