జియో నెట్ వర్కింగ్ పనుల్లో అపశ్రుతి.. కూలీ మృతి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కండుగుల గ్రామం లో జియో నెట్వర్కింగ్ సంబంధించి జరుగుతున్న పనులలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కండుగుల గ్రామం లో జియో నెట్వర్కింగ్ సంబంధించి జరుగుతున్న పనులలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అర్థ రాత్రి ఐదుగురు కూలీలు ఈ పనులు చేస్తుండగా ఇద్దరు కూలీలు జియో నెట్వర్కింగ్ కోసం తీసిన గోతిలో లో దిగి పనిచేస్తున్నారు . వారి మీద మట్టి పేల్లలు పడడం తో పైన ఉన్న కూలీలు వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు.గ్రామస్థులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించడం తో రంగం లో దిగిన పోలీసులు జే సి బి సహాయం తో మట్టి పెల్ల లను తొలగించి ఇద్దరు కులిలను బయటికి తీశారు. ఇందులో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం గా ఉండడం తో ఆసుపత్రికి తరలించారు..