TDP Suspends Chebrolu Kiran: రాజకీయాల్లో లేని మహిళలు, రాజకీయ నాయకుల ఇంట్లోని మహిళల పట్ల దిగజారి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా పెచ్చుమీరుతోంది. రానురాను మహిళలను కించపరిచేలా శృతిమించి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది. ఈక్రమంలో ఐ-టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోల్ కిరణ్.. ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై ఇటీవల పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ కిరణ్ ఎవరు, ఇతనిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంది అన్న విషయం చూద్దాం.