తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీని చేపడతామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే. దీంతో విద్యార్ధులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.