IMEC: భారత్-మధ్య ప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ)ని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదుర్చుకోవడంపై వాషింగ్టన్ (USA)లోని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో స్ట్రాటజిక్ టెక్నాలజీస్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మహ్మద్ సోలిమాన్ మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. చైనా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)కి చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో వాణిజ్యం కోసం IMECని బలోపేత సాధనంగా చూడటం బహుశా మరింత ఉపయోగకరంగా ఉంటుందనీ, ఇది భారతదేశం, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఐరోపా మధ్య వస్తువులు-సేవల తరలింపును సులభతరం చేస్తుంది.