BrahMos Supersonic Missile: పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తున్న బ్రహ్మోస్ క్షిపణిని కొనడానికి 17 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ఇప్పటికే బ్రహ్మోస్ ని కొన్న తర్వాత, మరిన్ని దేశాలు ఇండియాతో ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి.
BrahMos Missile 800km Range: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, బ్రహ్మోస్ క్షిపణి ఇటీవల బంగాళాఖాతంలో జరిపిన పరీక్షల్లో 800 కి.మీల పరిధిని విజయవంతంగా పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు మంగళవారం ధ్రువీకరించాయి.
ఇండియన్ నేవీ బంగాళాఖాతం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఇది తన అన్ని పారామీటర్లను విజయవంతంగా చేరుకుందని నేవీ అధికారులు తెలిపారు.
BrahMos missile: బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూజ్ క్షిపణికి ఎక్సటెండెడ్ వెర్షన్‌ను సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది. ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. దీని రేంజ్‌ను 350 కి.మీ. వరకు పెరిగింది.
Brahmos Supersonic Cruise Missile: భారత అమ్ములపొదలో మరోబ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. శత్రు దేశాల నుంచి పొంచి వున్న ముప్పునేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ బలమైన దేశంగా మారుతోంది. ఈ క్రమంలోనే భారత నౌకాదళ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.