Asianet News TeluguAsianet News Telugu

స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్: 13th జెనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్, ఎస్ పెన్‌తో లాంచ్, ల్యాప్‌టాప్ ధర ఎంతంటే

స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 అల్ట్రా ప్రారంభ ధర $2,199 డాలర్లు అంటే దాదాపు రూ. 1,80,000. 5Gతో కూడిన గెలాక్సీ బుక్ 3 ప్రొ 360 ప్రారంభ ధర $1,399 డాలర్లు అంటే దాదాపు రూ. 1,15,000. గెలాక్సీ బుక్ 3 ప్రొ ప్రారంభ ధర $1,249 డాలర్లు అంటే దాదాపు రూ. 1,02,500.

Samsung Galaxy Book 3 Series: Launched with 13th Gen Intel processor and S Pen know price of laptop
Author
First Published Feb 3, 2023, 2:00 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ స్యామ్సంగ్ గెలాక్సీ ఆన్ పాకేడ్ ఈవెంట్‌లో స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాకుండా, ఈ ఈవెంట్‌లో స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేశారు. గెలాక్సీ బుక్ 3 అల్ట్రా ల్యాప్‌టాప్ స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్‌ క్రింద తీసుకొచ్చారు, ఇది ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్ ఇంకా 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్‌తో Nvidia GeForce RTX 4000 సిరీస్ గ్రాఫిక్స్ కార్డ్‌ దీనిలో ఉంది. ఇవి కాకుండా, కంపెనీ గెలాక్సీ బుక్ 3 ప్రొ 360ని కూడా పరిచయం చేసింది, ఇది ఒక S పెన్ సపోర్ట్‌తో టూ ఇన్ వన్ ల్యాప్‌టాప్. దీనితో కంపెనీ గెలాక్సీ ట్యాబ్, గెలాక్సీ ఫోన్‌తో కనెక్టివిటీ కోసం మల్టీ కంట్రోల్ ఫీచర్‌ను ఇచ్చింది.

ధర
గెలాక్సీ బుక్ 3 అల్ట్రా ప్రారంభ ధర $2,199 డాలర్లు అంటే దాదాపు రూ. 1,80,000. 5Gతో కూడిన గెలాక్సీ బుక్ 3 ప్రొ 360 ప్రారంభ ధర $1,399 డాలర్లు అంటే దాదాపు రూ. 1,15,000. గెలాక్సీ బుక్ 3 ప్రొ ప్రారంభ ధర $1,249 డాలర్లు అంటే దాదాపు రూ. 1,02,500.

స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 స్పెసిఫికేషన్లు
గెలాక్సీ బుక్ 3 అల్ట్రాకి 3K రిజల్యూషన్‌తో 16-అంగుళాల డైనమిక్ ఆమోలెడ్ 2X డిస్‌ప్లే లభిస్తుంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz, గరిష్ట బ్రైట్ నెస్ 400 నిట్స్. దీనికి 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ లేదా కోర్ i9 ప్రాసెసర్ ఆప్షన్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం, ల్యాప్‌టాప్‌లో Nvidia GeForce RTX 4070 GPU లేదా GeForce RTX 4050 GPU ఆప్షన్ ల్యాప్‌టాప్ కి ఉంటుంది.

గెలాక్సీ బుక్ 3 అల్ట్రా Windows 11తో Wi-Fi 6E, బ్లూటూత్ 5.1ని పొందుతుంది. ల్యాప్‌టాప్ 32 GB LPDDR5 ర్యామ్, 1TB వరకు ఎస్‌ఎస్‌డి స్ట్రెఓజ్ అందించారు. ఫుల్ హెచ్‌డి డ్యూయల్ మైక్ కెమెరా సెటప్ దీనితో వస్తుంది. ఇది AKG క్వాడ్ స్పీకర్‌, దీనితో డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్ 100W USB టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 76Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. బ్యాక్‌లైట్ కీబోర్డ్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం, రెండు థండర్‌బోల్ట్ 4, ఒక USB టైప్-A, ఒక HDMI 2.0, మైక్రో SD అండ్ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3  ప్రొ 360, గెలాక్సీ బుక్ 3 ప్రొ స్పెసిఫికేషన్‌లు
స్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 3  ప్రొ 360 S పెన్ సపోర్ట్‌తో 16-అంగుళాల డైనమిక్ ఆమోలెడ్ 2X స్క్రీన్‌ ఉంది. దీనితో పాటు, 3K రిజల్యూషన్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 400 నిట్స్. గెలాక్సీ బుక్ 3 ప్రొని 14 అంగుళాలు ఇంకా 16 అంగుళాల సైజ్ లో లభిస్తుంది.

ఈ రెండు ల్యాప్‌టాప్‌లు 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్‌ పొందుతాయి. దీనికి 32జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 1TB వరకు SSD స్టోరేజ్ ఉంది. ఇందులో HD వెబ్‌క్యామ్ కూడా ఉంది. రెండు ల్యాప్‌టాప్‌లు డాల్బీ అట్మోస్‌తో పాటు AKG క్వాడ్ స్పీకర్‌లు ఉన్నాయి. గెలాక్సీ బుక్ 3  ప్రొ 360 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 76Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 14-అంగుళాల గెలాక్సీ బుక్ 3 ప్రో 63Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 16-అంగుళాల మోడల్‌లో 76Wh బ్యాటరీ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios