రాజస్థాన్‌లో ముగ్గురు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్: సోషల్ మీడియాపై నెటిజన్ ఇలా...
రాజస్థాన్ లో ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం ఘటన కలకలం రేపుతుంది. ఈ విషయమై నెటిజన్ సెటైర్లు వేశారు.

న్యూఢిల్లీ:రాజస్థాన్ రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఘటనలపై బీజేపీ రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తుంది. ఇటీవల కాలంలో ముగ్గురు టీనేజ్ బాలికలపై అత్యాచారం చోటు చేసుకుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ తరహా ఘటనలపై సోషల్ మీడియాలో ఎలాంటి హడావుడి లేదని నెటిజన్ రిషి బాగ్రి సెటైర్లు వేశారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి మీడియాలో రిపోర్టు చేసిన కథనాన్ని ఆయన షేర్ చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ ప్రాంతంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు దుండగులు. ఈ నెల 27న బాలిక స్కూల్ కు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బాధితురాలిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
మరో వైపు ఓ ప్రైవేట్ పొలంలో పనిచేస్తున్న వ్యక్తి ఇద్దరు కూతుళ్లపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు ప్రస్తుతం గర్భం దాల్చారు. పొలంలో తల్లిదండ్రులు పనిచేస్తున్న సమయంలో అక్కా చెల్లెళ్లు ఇద్దరిని దుండగులు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో వీరిద్దరూ గర్భం దాల్చారు. బాధితుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత మాసంలో కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న దళిత విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత దళిత యువతిపై యాసిడ్ దాడి చేసి బావిలో వేసిన ఘటనపై విపక్షాలు మండిపడ్డాయి. మరో వైపు రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని సజీవ దహనం చేసిన ఘటనపై కాంగ్రెస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.