Telangana Cabinet Expansion : కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొత్తగా చేరేదెవరు..? కీలకమైన హోమంత్రి పదవి ఎవరికి దక్కుతుంది..? తెలంగాణ రాజకీయాల్లోనే కాదు  ప్రజల్లోనూ ఇదే చర్చ. లోక్ సభ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు... ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నట్లు కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. రేపో మాపో ప్రభుత్వం నుండి కొత్తగా మంత్రివర్గంలో చేరేదెవరో ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ఇవాళ మంత్రి దామోదర విలేకరులో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయన కీలక సమాచారం వెల్లడించారు. కేవలం కొత్తవారికి మంత్రివర్గంలో చోటు దక్కడమే కాదు ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులుచేర్పులు వుంటాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి ఎవరు అవుతారన్నది ఉత్కంఠగా మారింది...దీనిపై కూడా రాజనర్సిహ క్లారిటీ ఇచ్చేసారు. హోంమంత్రి పదవి ప్రస్తుత పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్కకు దక్కే అవకాశం వుందని రాజనర్సింహ తెలిపారు. 

ఇక ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు... కాబట్టి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కదని సామాన్యులే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. కానీ దామోదర రాజనర్సింహ మాత్రం రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కవచ్చంటూ బాంబు పేల్చారు. ఇదే నిజమైతే సంచలనమే అవుతుంది. గత ప్రభుత్వంలో తండ్రీ కొడుకులను మంత్రివర్గంలో చూసిన ప్రజలు ఈ ప్రభుత్వంలో అన్నాదమ్ములను కేబినెట్ లో చూసే అవకాశం వుంటుంది. 

ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ బలహీనంగా వుందన్నది గత అసెంబ్లీ పలితాలను బట్టి అర్థమవుతుంది... కాబట్టి ఇక్కడ ఆ పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు.ఇందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ కూడా చెప్పారు... కేబినెట్ లో దానంకు చోటు దక్కవచ్చని అన్నారు.  

మొత్తంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై కన్ఫ్యూజన్ కొనసాగుతున్న వేళ మంత్రి రాజనర్సింహ ఓ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరున్న కీలకమైన హోం, విద్యా శాఖ ఆయన సన్నిహితులకే దక్కే అవకాశాలున్నట్లు దామోదర వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇలా కేబినెట్ లో కొత్తగా ఐదారుగురు కొత్తవారికి అవకాశం దక్కవచ్చని... ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులుచేర్పులు వుండనున్నాయి. దామోదర  రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు... ప్రస్తుతం మంత్రి కూడా... కాబట్టి ఆయనకు కేబినెట్ విస్తరణపై, ఎవరికి ఏ శాఖ దక్కనుందో పక్కా సమాచారం వుండివుంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్లే జరుగుతుందని రాజకీయ వర్గాలే కాదు ప్రజలు కూడా నమ్ముతున్నారు.

సీతక్కే హోంమంత్రి..? ఏషియా నెట్ అప్పుడే చెప్పింది...  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం హోం, విద్యా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆండ్ అర్బన్ డెవలప్‌మెంట్,  వాణిజ్య పన్నులు,జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖలున్నాయి. ఇందులో అత్యంత కీలకమైనది హోంశాఖ... కాబట్టి ఈ శాఖను సీఎం కాంగ్రెస్ సీనియర్లకు దక్కనివ్వడని ఏషియా నెట్ ఎప్పుడో చెప్పింది. తన సన్నిహితులనే హోమంత్రిని చేసే అవకాశాలున్నాయని చెప్పింది. ఇప్పుడు అలాగే జరిగేలా కనిపిస్తోంది... మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు ఇదే చెబుతున్నాయి. 

తెలంగాణ కేబినెట్ విస్తరణ ... వారికే మంత్రులుగా ఛాన్స్ : సీఎం రేవంత్

 సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు సీతక్క... ఆమెను సొంత సోదరిలా భావిస్తుంటారాయన. ఆమె కూడా రేవంత్ కు ఎంతో నమ్మకంగా వుంటుంది. తెలుగుదేశం పార్టీలో నుండి రేవంత్ వెంట కాంగ్రెస్ లో చేరినవారిలో సీతక్క ఒకరు... కాబట్టి ఆమెకు టికెట్ ఇప్పించి మరోసారి ఎమ్మెల్యేను, అధికారంలోకి రాగానే మంత్రిని చేసారు రేవంత్. ఇలా రాజకీయంగా సీతక్కకు అండగా వుంటున్నారు సీఎం రేవంత్. 

అయితే ఇప్పుడు సీతక్కకు ప్రమోషన్ ఇచ్చి ఏకంగా హోంమంత్రిని చేసే అవకాశాలున్నాయని రేవంత్ కేబినెట్ లోని మరో మంత్రి చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఏషియా నెట్ ఎప్పుడో చెప్పింది. ఒకవేళ హోంమంత్రిత్వ శాఖను రేవంత్ వదులుకోవాల్సి వస్తే పక్కా అది సీతక్కకే దక్కుతుందని  చెప్పాం... ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ సీతక్కకు హోంమంత్రి పదవి దక్కితే తెలంగాణ మొదటి మహిళా హోంమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు.