సుశీల్ మెడకు మరింత ఉచ్చు.. దాడి వీడియోలు వైరల్..
యువ రెజ్లర్ సాగర్ రాణా మీద సుశీల్ కుమార్ దాడి చేస్తున్నవీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ ఫుటేజ్ హిందీ ఇంగ్లీష్ మీడియా లో ప్రసారమవుతుంది. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రానా పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్ కుమార్ బేస్ బాల్ స్టిక్ చేతిలో పట్టుకున్నాడు.
యువ రెజ్లర్ సాగర్ రాణా మీద సుశీల్ కుమార్ దాడి చేస్తున్నవీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ ఫుటేజ్ హిందీ ఇంగ్లీష్ మీడియా లో ప్రసారమవుతుంది. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రానా పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్ కుమార్ బేస్ బాల్ స్టిక్ చేతిలో పట్టుకున్నాడు.
ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది. కొన్ని రోజుల క్రితం ఛత్రసాల్ స్టేడియంలో సుశీల్ బృందం సాగర్ రాణా మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడు చేత సుశీల ఈ వీడియో తీయించారు. అదే ఇప్పుడు అతని మెడకు మరింత ఉచ్చులా చిక్కుకుంది.
దానిని రెజ్లింగ్ వర్గాలకు పంపించాలనుకున్నాడు. కానీ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతను పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల గాలింపు, లక్ష రూపాయల రివార్డు, ముందస్తు బెయిల్ తిరస్కరణ, కోర్టు రిమాండ్.. దర్యాప్తునకు సహకరించక పోవడం వంటి విషయాలు తెలిసినవే.
కాగా, ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై హత్యకేసు నమోదైంది. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో జరిగిన ఓ గొడవ, ఓ రెజ్లర్ హత్యకు దారి తీసింది. ఈ గొడవ జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు ఘర్షణ జరగడానికి కారణం అతనేనని అనుమానిస్తున్నారు పోలీసులు.
సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు, తుపాకీలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 22 యువ రెజ్లర్ సాగర్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుశీల్ కుమార్‌పై హత్యానేరం కేసు నమోదుచేసిన పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు. అయితే సుశీల్ కుమార్ మాత్రం ఈ సంఘటనపై తనకే సంబంధం లేదంటున్నాడు.
2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్, 2012లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ‘రాజీవ్ ఖేల్‌రత్న’తో పాటు ‘అర్జున’ అవార్డు కూడా సొంతం చేసుకున్న సుశీల్ కుమార్‌పై హత్యకేసు నమోదుకావడం కలకలం రేపుతోంది.
అయితే ఈ కేసులో.. గత కొద్ది రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు చిక్కాడు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుశీల్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా.. న్యాయస్థానం సైతం అతనికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. అయినప్పటికీ సుశీల్ దాదాపు 19 రోజులపాటుగా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా.. చివరకు ఆదివారం పోలీసులకు చిక్కాడు.
ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్ కుమార్, అతడి అనుచరుడు అజయ్ కుమార్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుశీల్, అజయ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్‌ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు.
ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్‌లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సోనూ, అమిత్ పేర్కొన్నారు.
దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. చివరకు ఢిల్లీలో పట్టుపడ్డాడు.