చందు మొండేటి నెక్ట్స్ తెలుగు హీరోతోనే?చైతు కాదు
Chandoo mondeti: యంగ్ డైరెక్టర్ చందు మొండేటి వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నారు. ఆయన తదుపరి సినిమా సూర్యతో అనుకున్నారు కానీ తెలుగు హీరోతోనే ఉండబోతోందని సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Director Chandoo mondeti next movie in talks in telugu
Chandoo mondeti: ఇప్పుడు తెలుగులో ఫామ్ లో ఉన్న యంగ్ డైరక్టర్స్ లో ఒకరు చందు మొండేటి. రీసెంట్ గా నిఖిల్ తో కార్తికేయ2, నాగ చైతన్యతో తండేల్ ఇలా వరుసగా రెండు భారీ హిట్స్ కొట్టారు.
ఈ క్రమంలో దర్శకుడు చందు మొండేటి నెక్ట్స్ ప్లాన్ ఏంటి, ఏ హీరో తో జర్నీ చేయబోతున్నాడనే విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికైతే మూడు సినిమాలు ప్రకటించాడీ దర్శకుడు.
Director Chandoo mondeti next movie in talks in telugu
కార్తికేయ2 హిట్ తర్వాత చందు మొండేటికి నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చినా అప్పటికే కమిటైన గీతా ఆర్ట్స్‌ను వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని అల్లు అరవిందే స్వయంగా చెప్పాడు. ఈ క్రమంలో తండేల్ తో గీతా ఆర్ట్స్ కు లాభాలు తెచ్చి పెట్టిన చందు..అక్కడే మరో సినిమా చెయ్యబోతున్నారు.
హీరోగా రామ్ ఉండవచ్చనేది తాజా వార్త. సూర్యతో ఓ కథ అనుకున్నా టైమ్ పట్టేలా ఉందని, దాన్ని ప్రక్కన పెట్టారట. ఈ క్రమంలో హీరో రామ్ ని కలిసి , ఓ కథ చెప్పటం, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయిట. ప్రస్తుతం రామ్ చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుందని అంటున్నారు.
Director Chandoo mondeti next movie in talks in telugu
ఇక గీతా ఆర్ట్స్ ఆల్రెడీ సూర్య, బోయపాటి కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేసినా వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలో సూర్య తో చందు సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. చందు మొండేటి ఆల్రెడీ సూర్యాను కలిసి కథ చెప్పాడు. హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుగా సూర్య సినిమా మొదలవుతుందని దర్శకుడు చెబుతున్నాడు.
అలాగే ఈ గ్యాప్ లో కార్తికేయ 3ని పట్టాలెక్కిస్తాడని భావించారు. అయితే అనుకోని విధంగా రామ్ సీన్ లోకి వచ్చారు. మరో ప్రక్క నాగచైతన్యను తెనాలి రామకృష్ణగా చూపిస్తానని గతంలో ఎనౌన్స్ చేశాడు. ఏదైమైనా ప్రస్తుతం రామ్ తోనే ముందుకు వెళ్లేలా ఉంది. . అన్నీ కుదిరితే త్వరలో పూర్తి వివరాలతో ప్రకటన వస్తుంది.