Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'గం గం గణేశా' నిర్మాత మృతి, డ్రగ్స్ లింక్, రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

'గం గం గణేశా' నిర్మాత మృతి, డ్రగ్స్ లింక్, రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

 Revanth Reddy: ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, గతంలో రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో నిందితుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Surya Prakash | Published : Feb 27 2025, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu

Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu


 Revanth Reddy: తెలుగు సినీ  ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి   రీసెంట్ గా మృతి చెందిన విషయం తెలిసిందే. దుబాయ్ లో ఓ వివాహ వేడుక కు హాజరైన కేదార్ ఆ తర్వాత తాను విడిది చేసిన హోటల్ లో తుది శ్వాస విడిచారు. మంగళవారం అతను చనిపోయినట్లు దుబాయ్ అధికారులు తెలిపారు.

గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా మూవీకి  కేదార్ సెలగంశెట్టి ప్రొడ్యూసర్​గా వ్యవహరించారు.   కేదార్ (Kedar) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేదార్‌నాథ్‌ మరణంతో.. గతంలో సంచలనం రేపిన రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేదార్‌ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నా.. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

24
Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu

Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu


సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో వరుసగా అనుమానాస్పద మరణాలు సంభవిస్తున్నాయి. కేదార్‌ సైతం అనుమానాస్పదంగా మృతిచెందారు. అతను కేటీఆర్‌ వ్యాపార భాగస్వామి.. రాడిసన్‌ బ్లూ డ్రగ్స్‌ కేసులో నిందితుడు’ అని  పేర్కొన్నారు.

దాంతో ఈ విషయం  చర్చనీయాంశంగా మారింది. . నిద్రలోనే కేదార్ కన్నుమూశారన్నది ప్రాధమిక సమాచారం కాగా మాదక ద్రవ్యాలను అతిగా తీసుకున్నారనే వార్తలూ వచ్చాయి. అంతేకాదు... బీఆర్ఎస్ (BRS) కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కేదార్ తో పాటు అదే రూమ్ లో ఉన్నారని కొన్ని మీడియా వర్గాలు కథనాలను ప్రసారం చేశాయి. 
 

34
Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu

Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu


కేదార్‌నాథ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలుండేవి. అతను హైదరాబాద్‌లో పబ్‌లను సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేదార్‌ డ్రగ్స్‌ సేవించి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ కేసులో పోలీసులు నోటీస్‌ ఇచ్చి పంపించివేశారు. అప్పట్లో బీఎన్‌రెడ్డినగర్‌లో ఉన్న కేదార్‌నాథ్‌ తర్వాత దుబాయ్‌కి మకాం మార్చినట్లు తెలుస్తోంది. అక్కడే పలువురు ప్రముఖులతో కలిసి స్థిరాస్తి వ్యాపారంలోకి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక ఫంక్షన్‌కు హాజరై తిరిగి తన ఫ్లాట్‌కు వచ్చిన కేదార్‌ నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. 

44
Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu

Revanth Reddy sensational comments on producer Kedar Selagamsetty death in telugu


గతంలో సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నట్టు కేదార్ ఓ ప్రకటన చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ లోగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ (Anand Devarakonda) హీరోగా 'గం గం గణేశ' మూవీని కేదార్ నిర్మించారు.

రకరకాల కారణాలతో విడుదలలో జాప్యం జరిగిన ఈ సినిమా పరాజయం పాలైంది. అయితే... తాజా పరిణామాలతో కేదార్ నుండి తీసుకున్న అడ్వాన్స్ ను విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి ఇచ్చాశాడని తెలుస్తోంది.
 

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories