MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత.. అహ్మదాబాద్‌లో తొలి ప్లేయర్ !

IPL 2025: ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత.. అహ్మదాబాద్‌లో తొలి ప్లేయర్ !

Shubman Gill: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది.  మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఒకే వేదికపై 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు.

2 Min read
Mahesh Rajamoni
Published : Mar 29 2025, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL

Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL

Shubman Gill : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్  శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ స్టైలిష్ కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ వేదికపై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతను సాధించడానికి గిల్‌కు ఇంకా 14 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో 38 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడి ఈ ఘనత సాధించాడు.

 

25
Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL

Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL

నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు. ఇక్కడ 20 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి మూడు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు సాధించి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. మ్యాచ్ గిల్-సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలో స్కోరును 66 చేర్చారు. ఇది సీజన్ లో వికెట్ పడకుండా సాగిన తొలి ఇన్నింగ్స్ పవర్ ప్లేగా నిలిచింది. అయితే, తొమ్మిదవ ఓవర్లో గిల్ ను ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. 27 బంతుల్లో 38 పరుగుల గిల్ ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, నాలుగు బౌండరీలు బాదాడు.

35
Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL

Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL

ఈ మ్యాచ్ లో గిల్ ఒకే వేదికలో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా కూడా నిలిచాడు. కేవలం 20 ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఒకే వేదికపై వేయి పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో 19 ఇన్నింగ్స్‌లలో క్రిస్ గేల్ 1000 పరుగులు పూర్తి చేసి టాప్ లో కొనసాగుతున్నాడు. అలాగే, ఈ లిస్టులో ఉన్న డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 22 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగుల ఈ మైలురాయిని చేరుకుని మూడో స్థానంలో నిలిచాడు. మొహాలీలో 26 ఇన్నింగ్స్‌లలో షాన్ మార్ష్ 1000 పరుగులు పూర్తి చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

45
Top-5 players who have completed 1000 IPL runs at one venue

Top-5 players who have completed 1000 IPL runs at one venue

ఒక వేదికలో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్లు 

1.క్రిస్ గేల్: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 19 ఇన్నింగ్స్‌లు 
2. శుభ్‌మన్ గిల్: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ - 20 ఇన్నింగ్స్‌లు 
3. డేవిడ్ వార్నర్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ - 22 ఇన్నింగ్స్‌లు 
4. షాన్ మార్ష్: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి - 26 ఇన్నింగ్స్‌లు 
5. సూర్యకుమార్ యాదవ్: వాంఖడే స్టేడియం, ముంబై - 31 ఇన్నింగ్స్‌లు 

55
Top-5 players who have scored the most runs in a single venue in the IPL

Top-5 players who have scored the most runs in a single venue in the IPL

ఐపీఎల్ లో ఒకే వేదికలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు 

1.విరాట్ కోహ్లీ: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 3040+ పరుగులు 
2. రోహిత్ శర్మ: వాంఖడే స్టేడియం, ముంబై - 2295+ పరుగులు 
3. ఏబీ డివిలియర్స్: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 1960+ పరుగులు 
4. డేవిడ్ వార్నర్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ - 1623+ పరుగులు 
5. క్రిస్ గేల్: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 1561+ పరుగులు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved