Rohit Sharma: కటక్‌లో హిట్‌మ్యాన్ గర్జన.. 32వ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ
Rohit Sharma Century: భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో కటక్ లో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. తన సెంచరీ (119 పరుగులు) ఇన్నింగ్స్ లో అద్భుతమైన షాట్స్ తో భారీ సిక్సర్లు బాదాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
rohit sharma's bat roared in cuttack, hit the 32nd century of his odi career ind vs eng in telugu rma
Rohit Sharma Century: భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. తన ఫామ్ ను అందుకుంటూ ఇంగ్లాండ్ పై సూపర్ సెంచరీ కొట్టాడు. భారత జట్టును విజయం దిశగా ముందుకు నడిపంచాడు. తన కెరీర్ లో 32వ వన్డే సెంచరీతో కటక్ లో పరుగుల వరద పారించాడు.
భారత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు క్రికెట్ లవర్స్ కు బిగ్ గుడ్ న్యూస్ చెప్పాడు. అదే తాను ఫామ్ లోకి రావడం. ఫామ్ అందుకోవడమే కాదు సెంచరీ కొట్టి భారత్ ను ముందుకు నడిపించాడు.
కటక్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన సూపర్ హిట్టింగ్ ఆటతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. హిట్‌మన్ తన వన్డే కెరీర్‌లో 32వ సెంచరీని సాధించాడు. అలాగే, వన్డేల్లో తన రెండో వేగవంతమైన సెంచరీగా ఇది నిలిచింది.
Rohit Sharma
సిక్స్ తో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ సిక్సర్ తో తన 32వ టెస్ట్ సెంచరీని సాధించాడు. ఆదిల్ రషీద్ వేసిన బంతిని లాంగ్ ఆఫ్‌లో అద్భుతమైన సిక్స్ కొట్టి సెంచరీ మార్కును అందుకున్నాడు. కేవలం 76 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తర్వాత తన బ్యాట్‌ను ఊపుతూ తన సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ తన ఫామ్ గురించి ప్రశ్నలు, విమర్శలు లేవనెత్తిన వారికి సమాధానమిచ్చాడు. రోహిత్ రిటైర్మెంట్ ఎప్పుడు ఆగిన వారిని చెంపదెబ్బ కొట్టేలా సెంచరీ సాధించాడు.
వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన రోహిత్ శర్మ
రోహిత్ సెంచరీ చేయడానికి 76 బంతులు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు ఇది రెండవ వేగవంతమైన సెంచరీ. 2023లో ఆఫ్ఘనిస్తాన్‌పై రోహిత్ శర్మ కేవలం 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి తన కెరీర్ లో వేగవంతమైన వన్డే సెంచరీని సాధించాడు.
ఇక కటక్‌లో శుభ్‌మాన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేస్తూ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. 119 పరుగుల తన ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
Image Credit: Getty Images
రోహిత్ శర్మకు వన్డేల్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
63 బంతులు vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ 2023
76 బంతులు vs ఇంగ్లాండ్, కటక్ 2025
82 బంతులు vs ఇంగ్లాండ్, నాటింగ్‌హామ్ 2018
82 బంతులు vs న్యూజిలాండ్, ఇండోర్ 2023
84 బంతులు vs వెస్టిండీస్, గౌహతి 2018
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ ను అధిగమించాడు.
1 - సచిన్ టెండూల్కర్: 463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు
2 - విరాట్ కోహ్లీ: 296 మ్యాచ్‌ల్లో 13911 పరుగులు
3 - సౌరవ్ గంగూలీ: 311 మ్యాచ్‌ల్లో 11363 పరుగులు
4 - రోహిత్ శర్మ: 267 మ్యాచ్‌ల్లో 10987 పరుగులు
5 - రాహుల్ ద్రవిడ్: 344 మ్యాచ్‌ల్లో 10889 పరుగులు