మీ రూ.500 నోటుపై ‘*’ గుర్తు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి
మీ దగ్గర నక్షత్రం గుర్తు (*) ఉన్న రూ.500 నోటు ఉందా? సోషల్ మీడియాలో ఈ నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది.
500 notes
మీ దగ్గర నక్షత్రం గుర్తు (*) ఉన్న 500 రూపాయల నోటు ఉందా..? ఇలా * గుర్తు ఉన్న నోటు నకిలీది అని మీరు భయపడుతున్నారా? ఇక చింతించకండి...
Rs 500 Notes With Star Symbol Are Fake- PIB Fact Check Reveals Truth About Viral Message
స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (#PIBFactCheck) చెక్ పెట్టింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావని తేల్చి చెప్పింది. నక్షత్రం గుర్తు (*) ఉన్నరూ.500 నోట్లు డిసెంబర్ 2016 నుంచి చెలామణిలో ఉన్నట్లు స్పష్టం చేసింది.
500 notes
కాగా, స్టార్ సింబల్ ఉన్న నోట్ల విషయమై ఇప్పటికే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అవి నకిలీవి కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో నకిలీ నోట్లు అంటూ ప్రచారం మొదలు కావడంతో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ మరోసారి స్పష్టత ఇచ్చింది.
Rs 500 Notes With Star Symbol Are Fake- PIB Fact Check Reveals Truth About Viral Message
మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌లోని రూ.500 డినామినేషన్ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2016 డిసెంబర్‌లో జారీ చేసింది. రెండు నంబర్ ప్యానెల్‌లలో ఇన్‌సెట్ అక్షరం 'E'తో విడుదలైన ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్. పటేల్ సంతకం ఉంటుంది. ముద్రించిన సంవత్సరం 2016, బ్యాంక్ నోటు వెనుక భాగంలో స్వచ్ఛ్ భారత్ లోగో ముద్రితమై ఉంటుంది.
500 Notes
ప్రిఫిక్స్, నంబర్ల మధ్య ఖాళీలో ప్లేస్‌లో ఉన్న నంబర్ ప్యానెల్‌లో అదనపు అక్షరం ‘*’ (నక్షత్రం) ఉంటుంది. ఈ నోట్లు కూడా ఇతర నోట్ల మాదిరిగానే ఒక్కో కట్టకు 100 ఉంటాయి.. కానీ సీరియల్ క్రమంలో ఉండవు.
500 Notes with gold sign
ఇలా ‘*’ (స్టార్) గుర్తు ఉంటే ఆ నోట్లు రీప్లేస్ చేసినవి, పునర్ ముద్రించినవి అర్థం. రీప్లేస్ చేసినవి, పునర్ ముద్రించిన నోట్లను సులభంగా గుర్తించేందుకే రూ.500 నోట్లపై ‘*’ (స్టార్) ఉంటుంది.
500 note with * symbol
రూ. 500 డినామినేషన్‌లో ‘స్టార్’ నోట్లను తొలిసారిగా 2016లోనే విడుదల చశారు. అప్పటికే 10, 20, 50, 100 డినామినేషన్‌లో ‘స్టార్’ గుర్తున్న నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోట్లకు సంబంధించి 2006 ఏప్రిల్ 19న ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది.