ఐటం సాంగ్ కు ఊర్వశికి ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాకే

 “వాల్తేర్ వీరయ్య,” “ఏజెంట్,” “బ్రో”, స్కంద  చిత్రాలలో ఇప్పటికే  ఊర్వశి  నాలుగు ఐటెం సాంగ్స్ చేసింది. ఆమె ఐదవ ఐటమ్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

Urvashi Rautela signs yet another item song in Telugu jsp

  
 బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అక్కడ కన్నా తెలుగులోనే బిజీగా ఉంది. ఆమె ఇక్కడ వరస ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. ఆమె గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనంతగా పాపులర్ అయ్యిపోయింది. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి నటిగా బిజీ అవుతుందనుకుంటే ఐటెం సాంగ్స్ కే పరిమితం అవ్వటం ఆమె ఫ్యాన్స్ కు బాధ కలిగించే విషయమే.  అయితే ఐటెం సాంగ్ లలో పని తక్కువ..రెమ్యునరేషన్ ఎక్కవ. అందుకే   ఊర్వశి ఐటెం భామగా ఉండటానికి ఇష్టపడుతోంది.

 ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైన ఊర్వశి రౌతేలా చిరంజీవి పక్కన వేసిన స్టెప్స్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో అందరూ ఊహించినట్టుగానే ఊర్వశి వరుస తెలుగు అవకాశాలతో దుసుకుపోతుంది. నిజానికి ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయడం ఆమె పర్సనల్ గా ఇష్టపడుతోంది అని  మీడియా అంటోంది. 

ఈ క్రమంలో  హీరోయిన్స్ కు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కూడా ఈ ఐటెం భామకు ఇచ్చే పారితోషికం అధికంగా ఉంటుందని అంటున్నారు. ఆమెకు ఎనభై లక్షలు దాకా పే చేస్తున్నట్లు సమాచారం. ఒక పాటకు అంత రేటు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు.   ఆమె ఇటీవల రామ్ పోతినేని “స్కంద” లో “కల్ట్ మామా” ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయినా ఊర్వశి రౌతేలా కొత్త ఆఫర్లను అందుకుంటుంది.

Urvashi Rautela signs yet another item song in Telugu jsp

 త్వరలో ఓ పెద్ద   తెలుగు సినిమా కోసం ఐటెం సాంగ్ చేయడానికి ఊర్వశిని సంప్రదించినట్లు సమాచారం. ఆమె పేరును త్వరలోనే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు ఆమె తెలుగు సినిమాలైన “వాల్తేర్ వీరయ్య,” “ఏజెంట్,” “బ్రో”, స్కంద వంటి నాలుగు ఐటెం సాంగ్స్ చేసింది. ఆమె ఐదవ ఐటమ్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios