Asianet News TeluguAsianet News Telugu

Vijay Devarakonda Nude Look: విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ వెనుక అసలు రీజన్ ఇదేనట!

లైగర్ మూవీ నుండి విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. అత్యంత వేగంగా వన్ మిలియన్ లైక్స్ సాధించిన పోస్టర్ గా రికార్డులకు ఎక్కింది. వంటిపై నూలుపోగు లేకుండా కెమెరా ముందుకు రావడం సంచలనంగా మారింది. అయితే ఈ లుక్ వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. 
 

this is the reason behind vijay devarakonda nude look from liger
Author
Hyderabad, First Published Jul 3, 2022, 11:45 AM IST

దర్శకుడు పూరి జగన్నాధ్ లైగర్ (Liger)మూవీతో సంచలనాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్క పోస్టర్ తో దేశం మొత్తం లైగర్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఏకంగా విజయ్ దేవరకొండను న్యూడ్ గా ప్రజెంట్ చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అత్యంత త్వరగా వన్ మిలియన్ వ్యూస్ సాధించిన పోస్టర్ గా రికార్డులకు ఎక్కింది. అలాగే అనేక మంది చిత్ర ప్రముఖులు లైగర్ పోస్టర్ అద్భుతం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

అయితే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)నగ్నంగా కనిపించడం వెనుక పెద్ద కారణమే ఉందట. కథలో భాగంగా విజయ్ దేవరకొండ అలా నటించారని అంటున్నారు. లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. కథలో భాగంగా విజయ్ కొన్ని ఇంటర్నేషనల్ ఫైట్ క్లబ్స్ లో పాల్గొంటాడట. నిబంధల ప్రకారం ఫైట్ కి ముందు ప్రతి ఫైటర్ బాడీ వైట్ తో మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఆ సమయంలో ఫైటర్ ఒంటిపై నూలు పోగు కూడా ఉండకూడదు. ఈ సీన్ సహజంగా రావడానికి విజయ్ దేవరకొండ నగ్నంగా నటించారట. 

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ఇక లైగర్ మూవీ ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ విడుదల కాకుండానే పూరి-విజయ్ దేవరకొండ జనగణమన చిత్రాన్ని ప్రారంభించారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios