సారాంశం
రీజనల్ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసిన వారు ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి టీవి సీరిస్ లు ఇంకా ఏమి ఉన్నాయని వెతుకుతున్నారు.
ఓటీటీలు రాకముందే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ టీవీ సిరీస్ గా పేరు తెచ్చుకున్న 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 2011లో ప్రారంభమైన ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన దేశంలోనూ ఈ సూపర్ సిరీస్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి వంటి ప్రముఖులకు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేవరెట్ సిరీస్‌గా నిలిచింది.
ఫాంటసీ, యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్స్, రొమాన్స్ గ్రాఫిక్స్, మోసం, డైలాగ్స్ వంటి అన్ని అంశాలు కలగలిపిన ఈ యాక్షన్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. రీజనల్ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసిన వారు ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి టీవి సీరిస్ లు ఇంకా ఏమి ఉన్నాయని వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఓ లిస్ట్ ఇవ్వటం జరుగుతోంది.
1. The White Queen (2013)
2. Boardwalk Empire (2010-2014)
3. The Tudors (2007-2010)
4. The Last Kingdom (2015-2022)
5. Rome (2005-2007)
6. Spartacus (2010-2013)
7. The Witcher (2019-Present)
8. Vikings (2013-2020)
9. The Wheel of Time (2021-Present)
10. House of the Dragon (2022-Present)