మెగా ఫ్యామిలీ హీరోగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు. మెగా నీడ నుంచి బయటపడి తనకంటూ సొంత ఫాలోయింగ్‌ సంపాదించుకోవటంలో బన్నీ సక్సెస్‌ అయ్యాడు. అంతేకాదు టాలీవుడ్‌ మరే హీరోకు సాధ్యం కానీ విధంగా మళయాల ఇండస్ట్రీలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సాధించుకొని మల్లు అర్జున్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు బన్నీ హీరోగా తెరకెక్కిన మాస్ సినిమాలు, హిందీలో డబ్‌ అయి యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేశాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ బన్నీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. బన్నీ తన సినిమాల అప్‌డేట్స్‌తో పాటు తన పర్సనల్‌ విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటాడు బన్నీ. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించి క్యూట్‌ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు బన్నీ. అందుకే బన్నీ సోషల్ మీడియా అకౌంట్‌లకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో బన్నీ ఫేస్‌ బుక్ పేజ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్ల (కోటీ 30 లక్షల)కు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి సౌత్‌ హీరో బన్నీనే కావటం విశేషం. సౌత్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ లాంటి సూపర్‌ స్టార్‌కు కూడా ఈ స్థాయిలో లైక్స్‌ లేకపోవటం విశేషం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోకు అరుదైన గౌరవం దక్కటంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్‌, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్‌లో దర్శన మివ్వనున్నాడు. ఇక బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా విలన్‌గా నటిస్తున్నాడు.